బాలయ్య-పూరి ‘పైసా వసూల్’ చేసేటట్టే ఉన్నారు..

హీరో బాలక్రిష్ణతో పూరి జగన్నాథ్ తీస్తున్న పైసా వసూల్ సినిమా ‘స్టంపర్ ’ విడుదలైంది. టీజర్ లానే ఉన్న స్టంపర్ లాంటి వీడియోను యూట్యూబ్ , ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సినిమా యూనిట్ విడుదల చేసింది.. డ్రగ్స్ కేసు వెంటాడుతున్నా కూడా ఎక్కడా మనోధైర్యం కోల్పోకుండా పూరి జగన్నాథ్ బాలయ్య సినిమాను వేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ రోజు టీజర్ విడుదల చేయడం విశేషం..

పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసువల్ల చాలా డిస్ట్రబ్ అయ్యాడు. కానీ ఆ ప్రభావం సినిమాపై పడకుండా వీలైనంత వేగంగా బాలక్రిష్ణ సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. బాలక్రిష్ణను ఈ టీజర్ లో కొత్తగా చూపించాడు. బాలయ్య లుక్.. తెలంగాణ యాస డైలాగులు అదుర్స్ అనేలా ఉన్నాయి. రఫ్ ఇంగ్లీష్ ను బాలయ్య చేత పూరి పలికించిన తీరు ఆకట్టుకుంది. ఇక విదేశాల్లో బాలక్రిష్ణ ఫైట్లు, పోరాటాలు, కొత్తగా అనిపించాయి.

ఈ టీజర్ ను చూసిన రాంగోపాల్ వర్మ ప్రశంసల్లో ముంచెత్తాడు. సూపర్ డూపర్ అంటూ బాలయ్యను ఇలాంటి లుక్ లో తొలిసారి చూస్తున్నానని ఎంతో బాగున్నాడని వర్మ ఫేస్ బుక్ లో పోస్టు చేయడం విశేషం. ఇక బాలక్రిష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ను చివరి దశకు చేరుకున్నట్టు తెలిసింది. డ్రగ్స్ కేసు దరిమిలా పూరి వేగంగా కంప్లీట్ చేసి పైసావసూల్ సినిమాను త్వరలోనే విడుదల చేసేందుకు సిద్ధమయ్యారట..

పైసా వసూల్ స్టంపర్ ను కింద వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend