బాలయ్యకు స్పాట్‌ పెట్టిన మహేష్‌..!

మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పైడర్‌’ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. ముందుగా జూన్‌ అన్నారు, ఆ తర్వాత ఆగస్టు, ఇప్పుడు దసర కానుకగా సెప్టెంబర్‌లో విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సెప్టెంబర్‌ 27న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారట. అయితే అదే సమయంలో బాలయ్య 101వ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

బాలకృష్ణ తన 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అదే ఊపుతో ప్రస్తుతం పూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. వీరి కాంబినేషన్‌లో సినిమా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమా ప్రారంభం రోజే సెప్టెంబర్‌ 29న సినిమాను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేసి తీరుతానంటూ పూరి గట్టిగానే ప్రకటించాడు. దాంతో ఖచ్చితంగా పూరి అన్నట్లుగా బాలయ్య 101వ మూవీ దసరాకు రావడం ఖాయం.

ఇప్పుడు మహేష్‌బాబు సినిమా కూడా దసరాకే విడుదల కానున్న నేపథ్యంలో బాలయ్యకు కాస్త కంగరు తప్పదని అంటున్నారు. కేవలం రెండు రోజుల గ్యాప్‌లో విడుదల అవ్వడం అంటే రెండు సినిమాల కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా బాలయ్య సినిమా కలెక్షన్స్‌పై ఎక్కువ ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మరి విడుదల తేదీల్లో ఏమైనా మార్పులు చేస్తారా లేక అదే తేదీల్లో ఈ రెండు సినిమాలు వస్తాయా అనేది చూడాలి.

To Top

Send this to a friend