బాలయ్య చివరి సినిమా అదేనట!


నందమూరి బాలకృష్ణకు పౌరాణిక చిత్రాలు అంటే అభిమానం. ప్రస్తుతం ఉన్న స్టార్‌ హీరోల్లో బాలకృష్ణ పౌరాణిక పాత్రలకు సూట్‌ అయినట్లుగా మరే హీరో అంతగా సూట్‌ అవ్వడు అంటే అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం పౌరాణిక చిత్రాలకు పెద్దగా టైం బాగాలేదు. దాంతో బాలయ్య కోరుకున్నా కూడా పౌరాణిక పాత్రలు దక్కడం లేదు. దాదాపు 20 సంవత్సరాల క్రితం బాలయ్య ‘నర్తనశాల’ అనే పౌరాణిక చిత్రాన్ని ప్రారంభించాడు.

స్వీయ దర్శకత్వంలో ఆ సినిమాను తెరకెక్కించేందుకు అంతా సిద్దం చేశాడు. షూటింగ్‌ కూడా ప్రారంభం అయ్యింది. సినిమా కొన్ని రోజుల చిత్రీకరణ జరిగింది. ఆ సమయంలోనే సౌందర్య చనిపోవడంతో సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత బాలకృష్ణ ఒక కేసులో ఇరుకున్నాడు. దాంతో సినిమాను పూర్తిగా బాలయ్య పక్కకు పడేశాడు. అయితే బాలయ్యకు మాత్రం ఆ ప్రాజెక్ట్‌పై ఆశ ఇంకా అలాగే ఉన్నట్లుగా అనిపిస్తుంది. పలు సందర్బాల్లో ఆ సినిమా గురించి బాలయ్య మాట్లాడటం జరిగింది.

తాజాగా మరోసారి బాలకృష్ణ ఆ సినిమాపై తనకున్న అభిమానంను కనబర్చాడు. తన జీవితంలో నర్తనశాల సినిమా చేసి తీరుతాను అని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆ సినిమాను పూర్తి చేసి తీరుతాను అని బాలయ్య అంటున్నాడు. తన చివరి సినిమా ‘నర్తనశాల’ అయినా ఆశ్చర్యపోనవసరం లేదంటూ బాలయ్య షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి బాలయ్య తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘నర్తనశాల’ తీసుకు వచ్చే తీరుతాడనిపిస్తుంది.

To Top

Send this to a friend