బాహుబలి సాయంతో బాలయ్య ప్రయాణం

 

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. క్రిష్‌ దర్శకత్వంలో ఒక భారీ పౌరాణిక చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. అభిమానుల మరియు ప్రేక్షకుల అంచనాలను అందుకున్న ఆ సినిమాకు మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన సినిమాగా శాతకర్ణి నిలవడంతో బాలయ్య అభిమానుల ఆనందంకు హద్దు లేకుండా పోయాయి.

గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగులో విడుదలైన సమయంలోనే తమిళంలో విడుదల చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు విడుదల చేయలేక పోయారు. ఆ తర్వాత కూడా తమిళంలో విడుదల చేయాలని భావించినా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో నిర్మాతలు ఏం చేయలేక పోయారు. ఇప్పుడు ‘బాహుబలి 2’ సినిమా తమిళంలో విడుదలై దాదాపు 100 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెల్సిందే. బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగింది.

బాహుబలి పెంచిన స్థాయిని ఉపయోగించుకుని ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని తమిళంలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుపుతున్నారు. అతి త్వరలోనే సినిమాను తమిళనాట విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి బాహుబలిని ఆధరించినట్లుగా బాలయ్య శాతకర్ణిని కూడా తమిళ తంబీలు ఆధరిస్తారా అనేది చూడాలి.

To Top

Send this to a friend