బెయిల్ పిటీషన్ తీర్పు

ఉత్కంఠకు తెరపడింది. జగన్ జైలుకు వెళతాడా అన్న ఆందోళన వీడింది. సీబీఐ జగన్ నిబంధనలు ఉల్లంఘించాడని అతడి బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. కేసును ప్రభావితం చేస్తున్న జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ వేసిన పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది..

జగన్ తరఫు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. అంతేకాదు జగన్ విదేశీ పర్యటనకు కూడా కోర్టు అనుమతిచ్చింది. మే 15 నుంచి జూన్ 15 లోపు ఏవైనా 15 రోజులు విదేశీ పర్యటలనకు వెళ్లి రావచ్చని కోర్టు తెలిపింది. కుటుంబ సభ్యులతోనే కలిసి వెళ్లాలని షరతు విధించింది.

కాగా జగన్ ను జైలుకు పంపాలన్న సీబీఐ పిటీషన్ ను కోర్టు కొట్టివేయడంపై వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. న్యాయస్థానంలో జగన్ కు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కేసు విషయానికి వస్తే జగన్ మీడియా సాక్షిలో మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డితో సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావ్ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో జగన్ పై సీబీఐ పెట్టిన కేసులు నిలబడవని తేల్చిచెప్పారు. ఈ ఇంటర్వ్యూ కేసును ప్రభావితం చేస్తోందని.. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు సీబీఐ వాదనను తోసిపుచ్చి జగన్ కు ఊరట కల్పించింది. జగన్ విదేశీ పర్యటనలకు అనుమతినివ్వడం విశేషం..

To Top

Send this to a friend