బాహుబలిని ఆస్కార్ కు పంపిస్తాం

ఏపీ సీఎం చంద్రబాబు బాహుబలి చిత్రాన్ని చూశారు. చూసి తన్మయత్వం చెందారు. ఇంతటి అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీర్చిదిద్దిన రాజమౌళితో పాటు బాహుబలి టీం ను అభినందిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. భారతీయ సినిమా స్థాయిని పెంచిన బాహుబలి2ను అస్కార్ కు పంపేందుకు కేంద్రానికి సిఫార్సు చేస్తున్నానని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

సినిమా చూడగానే అద్భుతం అనిపించిందని.. మన రాష్ట్రవాసి రాజమౌళి తీసిన ఈ కళాఖండం దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని చిత్రమని కీర్తించారు. బాహుబలి2 సినిమాను చూడగానే ఏపీ సీఎం చంద్రబాబు రాజమౌళికి, రానాకు ఫోన్ చేసి అభినందించారు. ప్రభాస్ కు కూడా ట్రై చేసినా.. ఫారిన్ వెళ్లడంతో ఫోన్ చేయడం కుదరలేదని చంద్రబాబు చెప్పారు.

ఇక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన కళాతపస్వీ విశ్వనాథ్ ను ఏపీ సీఎం అభినందించారు. తెలుగు వెలుగులు దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించడం మన అదృష్టమని అన్నారు.

To Top

Send this to a friend