బాహుబలికి పెద్ద షాక్


బాహుబలి ప్రీమియర్లు రద్దు అయిపోయాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని తెలంగాణలో ప్రిమియర్ షోలకు అనుమతి లేదని తేల్చిపారేశారు. మరోవైపు బాలీవుడ్ లో ముఖ్యంగా ముంబైలో నిర్వహించాల్సిన ప్రీమియర్ షోలన్నీ రద్దు అయిపోయాయి. అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ ఖన్నా మరణంతో ఈ నిర్ణయం తసుకున్నామని హిందీలో బాలీవుడ్ చిత్ర సమర్పకుడు, దర్శకుడు కరణ్ జోహర్ ట్విట్టర్ లో ఈ మేరకు వెల్లడించారు.

బాలీవుడ్ అమితంగా ఇష్ణపడే నటుడు వినోద్ ఖన్నా మరణానికి సంతాపంగా ఈ రోజు రాత్రి వేయాల్సిన బాహుబలి ప్రీమియర్ ను రద్దు చేస్తున్నాం.. బాహుబలి టీం మొత్తం తీసుకున్న నిర్ణయమిది..’ అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.

కాగా ఏపీలో మాత్రం బాహుబలి ప్రీమియర్ షోలు ఈరోజునుంచే కొనసాగనున్నాయి. రేపటి నుంచి ఏపీలో ఆరు షోలు నిర్వహిస్తారు. తెలంగాణలో 5 షోలకు అనుమతి లభించింది. కాగా ఇప్పటికే అమెరికా, యూఏఈల్లో ప్రిమియర్ షోలు పడ్డాయి. ప్రఖ్యాత సినిమా క్రిటిక్ ఉమేర్ సంధూ యూఏఈలో బాహుబలి సినిమా చూసి అద్భుతమని 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. హ్యారీ పోటర్, ఫాస్ట అండ్ ఫ్యూరియస్ చిత్రాలకంటే కూడా అద్భుతంగా వచ్చిందని కితాబిచ్చారు.

To Top

Send this to a friend