‘బాహుబలి 2’ రివ్యూ..


రాజమౌళి తన మార్క్ సెంటిమెంట్ ను ఆయింట్ మెంటుగా పూసాడు.. ఎమోషనల్ సన్నివేశాలతో జనాలకు కంటతడి పెట్టించాడు. యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ తరహాలో చూపించి ఔరా అనిపించారు. మొత్తంగా బాహుబలి2తో ఓ కళాఖండాన్నే సృష్టించారు. ప్రభాస్, రానా రెండు కొదమ సింహాల్లా సినిమాలో కనిపించి తలపడ్డారు. రాజమాత శివగామి దేవి నటన నభూతో నభవిష్యతి అన్నట్టు ఉంది. మొదటి పార్ట్ లో శివగామి పాత్ర హైలైట్ అయితే రెండో భాగంలో దేవసేన పాత్ర ప్రాముఖ్యం సంపాదించింది. ప్రతి క్యారెక్టర్ ను దాని స్వభావాన్ని వివరించారు రాజమౌళి. అలాగే కట్టప్ప బాహుబలిని చంపించే సన్నివేశాలను సుధీర్ఘంగా హితబద్దంగా చిత్రీకరించి శభాష్ అనిపించుకున్నారు. ఈ సినిమా రివ్యూలోకి వెళితే..

* సినిమా మొత్తం నిడివి 171 నిమిషాల 50 సెకన్లు.

* ‘పరమేశ్వర ఈ బిడ్డ బతకాలి’ అంటూ శివగామి డైలాగ్‌తో సినిమా ప్రారంభం.

* ‘ఒక ప్రాణం ఒక త్యాగం’ సాంగ్‌తో టైటిల్స్‌ పడ్డాయి.

* రాక్షస దహన కాండ కోసం వెళ్తుండగా, శివగామికి ప్రమాదం. బాహుబలి వచ్చి కాపాడతాడు.

* ఆ తర్వాత ‘సాహోరే’ పాట వస్తుంది. ఆద్యంతం ఆకట్టుకునేలా సాంగ్‌ను చిత్రీకరించారు. భారీ కాన్వాస్‌పై ఈ పాట రంజింప చేసేలా ఉంది.

* అమరేంద్ర బాహుబలికి పట్టాభిషేకం జరగనుందనే విషయం తెలుసుకొని బిజ్జలదేవుడు పగతో రగలిపోతాడు.

* భళ్లాలదేవుడిని మహారాజుని కాకుండా చేసిన శివగామిని చంపేద్దామా ! అని తండ్రీ కొడుకుల మధ్య చర్చ జరుగుతుంది.

* పట్టాభిషేకం జరిగేలోపు దేశ పర్యటన చేసిన రమ్మని అమరేంద్ర బాహుబలిని శివగామి ఆదేశిస్తుంది.

* ప్రజల బాగోగులను తెలుసుకునేందుకు అమరేంద్ర బాహుబలి దేశ పర్యటనకు బయలుదేరతాడు.

* కుంతలరాజ్య యువరాణి దేవసేనను చూసి అమరేంద్ర బాహుబలి ప్రేమలో పడతాడు.

* కుంతల రాజ్యం దృశ్యాలు కనుల విందుగా ఉన్నాయి. ఓ పిరికివాడిలా అమరేంద్ర బాహుబలి ఆ రాజ్యంలోకి అడుగుపెడతాడు. నవ్వుల పువ్వులు పూయించే సన్నివేశాలు.

* దేవసేన బావగా కుమారవర్మ(సుబ్బరాజు) వస్తాడు.

* ‘కన్నా నిదురించరా.. మురిపాల ముకుందా’ పాట. ఇందులో అనుష్కను చాలా అందంగా చూపించారు. విజువల్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

* కుంతల రాజ్యంలో అమరేంద్ర బాహుబలి దేవసేన ప్రేమలో ఉన్నాడని వేగుల ద్వారా భళ్లాల, బిజ్జలదేవుడు తెలుసుకుంటారు.

* మాహిష్మతి సామ్రాజ్యానికి వచ్చిన వేగులు దేవసేన చిత్రాన్ని భళ్లాలదేవుడికి చూపిస్తారు. దేవసేన అందాన్ని చూసిన భళ్లాలదేవుడు ఆమెపై మనసు పడతాడు. దేవసేనను సొంతం చేసుకోవడానికి భళ్లాలదేవుడు వేసిన ఎత్తుతో కథ కీలక మలుపు.

* ఈ సందర్భంగా అత్యంత నాటకీ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దర్శకుడు రాజమౌళి చెప్పిన అసలైన డ్రామా తెరపై కనపడుతుంది. ప్రేక్షకుడిలో అంతకంతకూ ఉత్సుకత పెరిగేలా సన్నివేశాలు వరుసగా వస్తుంటాయి. ఇదే తదుపరి కథకు కీలకం.

* అనూహ్య పరిణామాలతో దేవసేన మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రతీ సన్నివేశమూ కథలో చాలాకీలకమైనవి. అమరేంద్ర బాహుబలికి విషమ పరీక్ష ఎదురవుతుంది. అప్పుడు బాహుబలి తీసుకునే నిర్ణయం వూహించని రీతిలో ఉంటుంది. దేవసేన తెరపై కనిపించిన దగ్గరి నుంచి విరామ సమయం వరకూ వచ్చే సన్నివేశాలన్నీ వూహించని విధంగా సాగుతాయి. అంతకంతకు పెరిగే ఉత్కంఠ సన్నివేశాల మధ్య ‘మాహిష్మతి వూపిరి పీల్చుకో’ అంటూ ఇంటర్వెల్‌ పడుతుంది.

* విరామం తర్వాత సన్నివేశాలు చకచక సాగిపోతుంటాయి. కథలో బలమైన సన్నివేశాలు వస్తుంటాయి. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకున్న పరిణామాలతో అమరేంద్ర బాహుబలి రాజ్యం విడిచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా వచ్చే ‘దండాలయ్య..’ పాట తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తుంది. చివరకు బాహుబలి మాహిష్మతిని విడిచి వెళ్లిపోతాడు. సన్నివేశాల్లో నాటకీయ పాళ్లు పెరగడమే కాదు. ఆసక్తిని పెంచేలా సాగడం తర్వాత సన్నివేశం ఏమై ఉంటుందా? అన్న ఉత్కంఠకు గురి చేసేలా ఉంటాయి. ప్రేక్షకుడు కథలో పూర్తిగా లీనమైపోతాడు.

* రాజ్యం నుంచి అమరేంద్ర బాహుబలి వెళ్లిపోయిన తర్వాత మరిన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బాహుబలిని చంపేందుకు కుట్ర జరుగుతుంది. ఇక్కడ వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేస్తాయి.

* ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ద్వారా ఏ ప్రశ్నకు సమాధానం కోసం యావత్‌ సినీ ప్రపంచం ఎదురు చూస్తోందో ఆ సన్నివేశం రానే వచ్చింది. దర్శకుడు జక్కన్నచెప్పినట్టు.. ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఒక్క ముక్కలో లభించదు. ఇదే సన్నివేశం గురించి ప్రభాస్‌ చెప్పినట్టుగా ఈ సన్నివేశానికి ముందు బలమైన సన్నివేశాలు ఎన్నో చోటు చేసుకుంటాయి. ప్రతీ సన్నివేశం అందుకు కారణమవుతుంది. అవన్నీ బాహుబలిని కట్టప్ప చంపేందుకు కారణమవుతాయి. బాహుబలిని కట్టప్ప చంపేసిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో రానా నటన ఆకట్టుకునేలా ఉండటంతో పాటు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి.ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆ పసికందు(మహేంద్ర బాహుబలి) ప్రాణాలు కాపాడేందుకు రాజమాత శివగామి ప్రాణత్యాగం చేస్తుంది. దేవసేన చెరలో బందీ అవుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌ ముగుస్తుంది.

* సుమారు రెండేళ్ల నుంచీ ప్రేక్షకులు ఎదురు చూసిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ క్లైమాక్స్‌కు వచ్చేసింది. మహారాజైన భళ్లాలదేవుడు, మహేంద్రబాహుబలి మధ్య వచ్చే యుద్ధ సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. రెండు కొదమ సింహాలు తలపడుతున్నట్టుగా ప్రేక్షకుడు అనుభూతికి లోనవుతాడు. యుద్ధ సన్నివేశాలకు కీరవాణి అందించిన నేపథ్య సంగీతం మరోస్థాయికి తీసుకెళ్లింది. ‘..కన్‌క్లూజన్‌’తో రాజమౌళి ప్రేక్షకుడి పంచ-భక్ష్య పరమాన్నాలతో కూడిన భోజనం పెట్టాడనే చెప్పాలి.
 

మీ అభిప్రాయం:

 

To Top

Send this to a friend