బాహుబలి2 పై కొత్త న్యూస్


బాహుబలి2 కోసం జనం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు ముందే సినిమా టికెట్ల కోసం విపరీతమైన పోటీనెలకొంది. ఫస్ట్ షో కోసం వేలకు వేలు తగలేస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే దానిపై సస్పన్స్ తెలుసుకునేందుకు అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

భారీ గ్రాఫిక్స్ , వందల కోట్ల ఖర్చుతో భారీ విజువల్ వండర్ లా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జక్కన్న ఎంతో కష్టపడి దాదాపు 5ఏళ్లుగా చెక్కాడు. ఈ అద్భుతమైన సినిమా గురించి మరో లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. సోమవారం ఈ చిత్రం సెన్సార్ పూర్తయ్యిందని ఫిలింనగర్ సమాచారం. ఏప్రిల్ 17న చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్టు తెలిసింది. బాహుబలి2 సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అద్భుతంగా ఉందని .. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని కితాబిచ్చినట్టు సమాచారం.

కాగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మళయాలం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ పూర్తయ్యాక ఈ సినిమాకు వచ్చిన సర్టిఫికెట్ ను రిలీవ్ చేయాలని భావిస్తున్నట్టు బాహుబలి టీం భావిస్తున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ప్రమోషన్ మొదలు పెట్టారు. ప్రస్తుతం ప్రభాస్, అనుష్క చిత్రవిశేషాలను మీడియాతో పంచుకున్నారు.

To Top

Send this to a friend