బాహుబలి2 లీక్


విడుదలకు ముందే బాహుబలి2 లీక్ అయిపోయింది. ఎక్కడో ప్రిమియర్ షోలో తీసిన బాహుబలి2 వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. తమిళ వెర్షన్ ఈ లీక్ కు గురైంది. టెక్నాలజీ విస్తృతంగా వ్యాప్తి చెందిన ఈ తరుణంలో సెల్ ఫోన్ల వల్ల ఇది సగటు ప్రేక్షకుడి దాకా వెళ్లింది. దాదాపు 2.50 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో భళ్లాలదేవుడిని రాజుగా ప్రకటించే సీన్ కనిపించింది. బాహుబలి భళ్లాలకు సేనాధిపతిగా సెక్యూరిటీగా వచ్చి రాజ్య పట్టాభిషేకం చేయించే సీన్ కనిపిస్తుంది.

అయితే ఈ క్లిప్ ఎక్కడా ప్రదర్శించలేదని.. తాము విడుదల చేసింది కాదని బాహుబలి నిర్మాతలు ప్రకటించారు. అందుకే యూట్యూబ్, ఫేస్ బుక్ ల నుంచి తొలగించారు. కానీ వాట్సాప్ లలో మాత్రం తెగతిరుగుతోంది. అలాగే అనుష్క కూడా ఈ సీన్ లో కనిపించింది. కొంచెం బొద్దుగాన ఇందులో ఉంది.

కాగా సినిమా విడుదల కాకముందే బాహుబలి క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం సంచలనం సృష్టించింది. ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉండడంతో సినిమా ఎక్కడ ప్రదర్శించారో తెలియదు కానీ ఎవరో తీసి ఇలా షేర్ చేశారు. అది తొందరగా సర్య్కూలేట్ అవుతోంది. ఒకవేళ బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడనే సీన్ బయటకు వస్తే మాత్రం ఈ సినిమా హైప్ పోయి నిర్మాతలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సో ఇప్పటికైనా బాహుబలి టీం, రాజమౌళి, నిర్మాతలు సినిమా బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలి.. లేకపోతే ఇంత భారీ బడ్జెట్ కు కష్టాలు తప్పవు.

To Top

Send this to a friend