బాహుబలి టికెట్ మేనియా..


బాహుబలి సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని ఊపేస్తోంది. ఈ సినిమా చూసేందుకు జనం ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. టికెట్ల కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. ఈ మేనియా పై వాట్సాప్, ఫేస్ బుక్ లలో ఎన్నో పేరడీలు, కామెడీలు, విశ్లేషనలు వెల్లువెత్తుతున్నాయి.. బాహుబలి టికెట్ కోసం ఇళ్లు గుల్ల చేసుకున్నారని ఒక పేరడీ వార్త సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది. బాహుబలి సినిమాకు ఫ్యామిలీ అందరినీ పంపించి దొంగలు వారి ఇంటిని గుల్ల చేశారన్నది సారాంశం.. బాహుబలి మేనియాలో పడి జనం కన్ను, మిన్ను మరిచిపోయారన్నది ఈ కథనంలో వెల్లడించారు.. మీరూ చదివి.. ఆనందించండి..

ఒక వ్యక్తి తన కారు ని ఇంటిముందు భద్రంగా పెట్టుకొని పడుకున్నాడు.తెల్లవారు ఝామున చూస్తే కారు లేదు..లబోదిబో మన్నాడు…వెదికేడు..పోలిస్ కంప్లైట్ ఇచ్చాడు.రెండు రోజుల తర్వాత తన కారు యధాస్థానంలో భద్రంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
కారు డోరు తెరిచి చూసాడు..అందులో ఒక లేఖ ఉంది.

సార్ నన్ను క్షమించండి. మీ కారు మీకు చెప్పకుండా తీసుకెళ్ళి నందుకు..రెండు రోజుల క్రిందట మా అమ్మ కి తీవ్ర అనారోగ్యం వల్ల ..ఆ సమయంలో ఎక్కడా ఆటోకానీ క్యాబ్ కానీ దొరకలేదు ..గత్యంతరము లేక మీ కారు తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది.ఇప్పుడు మా అమ్మ క్షేమంగా ఉంది. మీ కారు భద్రంగా మీకు ఇస్తున్నాను..ఇందులో ముందు ఎంత పెట్రోలు ఉండేదో అంతా ఉంది.. కానీ మిమ్మల్ని అడగకుండా కారు తీస్కెళ్ళినందుకు ప్రత్యామ్నాయంగా ఈరోజు సెకండ్ షో బాహుబలి2 సినిమా టిక్కెట్లు5 కార్లో పెట్టి ఉంచాను.మీరు నా మీద ఆగ్రహించకుండా..మీ కుటుంబం తో సినిమా చూసి ఆనందించి రండి..ఇది నా ప్రార్థన.

మొత్తం ఉత్తరం చదివి..అర్ధం చేసుకొని…తన కారు భద్రంగావచ్చేసిందని ఆనందించి పోలిస్ కంప్లైట్ వాపసు తీస్కున్నాడు.. రాత్రి  సెకండ్ షో కి బాహుబలి 2 సినిమాకి కుటుంబంతో వెళ్ళి వచ్చాడు.ఇంటికొచ్చేసరికి ఇంటితాళం బద్దలై ఉంది…పరుగున లోపలికి వెళ్ళిచూసేసరికి 25-30 లక్షల విలువైన బంగారం మిగిలిన ఆస్తులు మాయం అయ్యాయి…అక్కడ ఒక చీటీ లో ఇలా రాసి ఉంది…ఇప్పుడు అర్ధం అయిందా కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపేడో అని..ఇలా బాహుబలిని దొంగలు కూడా ఉపయోగించుకొని తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారన్నది కథనం సారాంశం..

To Top

Send this to a friend