బాహుబలి మొదట పవన్ కాదు.. ప్రభాసే..


బాహుబలి కథను మొదట రాజమౌళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చెప్పాడని.. ఆయన అంత పెద్ద లెన్తీ ఫిలిం చేయడానికి ఇష్టపడకపోవడంతో ప్రభాస్ ను హీరోగా తీసుకున్నాడని వార్తలు వెలువడ్డాయి.. మొదట ప్రభాస్ ను భళ్లాల దేవుడి పాత్రకు అనుకున్నాడని.. చివరకు హీరోగా తీసుకున్నాడని ప్రచారం జరిగింది. దీనిపై రాజమౌళి స్పందించారు.

రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి కథను తాను మొదట రాసుకున్నప్పుడే ఈ కథకు ప్రభాస్ అయితేనే సెట్ అవుతాడని నిర్ధారించుకున్నానన్నారు. ఈ కథ కోసం రాత్రి పగలు కసరత్తు చేశామని మాతో పాటు ప్రభాస్ కూడా కష్టపడ్డాడని తెలిపారు. దేహధారుడ్యం, ఇతర కత్తిసాములు, చారిత్రక నేపథ్యం తెలుసుకునే విషయంలో ప్రభాస్ చూపించిన చొరవ అద్భుతమన్నారు.

బాహుబలి కథ సిద్ధం అయ్యాక హీరోగా మొదట ప్రభాసే అనుకున్నామని.. పవన్ కు ఈ కథ వినిపించలేదని రాజమౌళి స్పష్టం చేశాడు. కట్టప్ప, శివగామి, దేవసేన, భళ్లాల దేవ, బిచ్చలదేవ పాత్రల కోసం మాత్రం నటులను వెతికామని తెలిపారు. శివగామిగా మొదట శ్రీదేవిని అనుకున్నామని కానీ రమ్యక్రిష్ణ ఫైనల్ అయ్యిందని తెలిపారు. కట్టప్ప, భళ్లాల, బిచ్చల దేవి పాత్రలకు కూడా వారే నని అనుకోలేదని రాజమౌళి స్పష్టం చేశాడు.

To Top

Send this to a friend