బాహుబలి స్ఫూర్తితో చిరు ఉయ్యాలవాడ ..


మెగాస్టార్ చిరంజీవికి హిందీలో కూడా మార్కెట్ ఉంది. గతంలో చిరు పలు హిందీ స్ట్రెయిట్ సినిమాలు చేశాడు. ఖైదీనంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చి 100 కోట్ల మార్కు వసూళ్లను దాటాడు. వసూళ్లపరంగా చింత లేకపోవడంతో చిరు మహా సాహసం చేస్తున్నాడు. తన కొత్త చిత్రం ఉయ్యాలవాడ నరసింహరెడ్డి సినిమా బడ్జెట్ ను 150 కోట్లకు పెంచేందుకు వెనకాడడం లేదు.

ఉయ్యాలవాడ సినిమా ను తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా రిలీజ్ చేయాలని చిరంజీవి నిర్ణయించినట్లు సమాచారం. బ్రిటీష్ పాలకుల మీద దండెత్తిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్ తో తీసి చిరంజీవి తన స్టామినాను ప్రూవ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం ఉయ్యాలవాడ ప్రీ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రాంచరణ్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరంజీవి సరసన ఐశ్వర్యరాయ్ ను హీరోయిన్ గా నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టులో సెట్స్ మీదకు తీసుకెళ్లి ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో బాహుబలి తర్వాత చిరు ఉయ్యాలవాడ సినిమా మరోసారి జాతీయ స్థాయిలో తెలుగు సినిమా స్టామినాను నిరూపించేందుకు రెడీ అవుతున్నదన్న మాట..

To Top

Send this to a friend