బాహుబలి కి ఆ ఒక్కటే మైనస్


బాహుబలి2 శుక్రవారం విడుదలైంది.. రికార్డులు సృష్టిస్తోంది.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్, రానా, రమ్యక్రిష్ణ, అనుష్క, సత్యరాజ్ ల నటన, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

అయితే బాహుబలి2లో అదొక్కటై మైనస్ అంటున్నారు సినిమా చూసిన జనం.. ఫస్టాఫ్ బ్రహ్మాండంగా సాగిపోగా సెకండాఫ్ లో మాత్రం రాజమౌళి సుధీర్ఘంగా సాగతీతను పెట్టారని జనం చెబుతున్నారు. ఇదొక్కటి తప్పితే స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా కుదిరాయంటున్నారు.. మొదటి పార్ట్ లో శివగామి కీలక పాత్రలో నటించగా.. రెండోపార్ట్ లో దేవసేన కథను మలుపుతిప్పే పాత్రలో కనిపించిందని చెబుతున్నారు. దేవ సేన చేయిపట్టి రాజ్యాన్ని బాహుబలి వదులుకొని సర్వసైన్యాధిక్షుడు అవుతాడని.. భళ్లాల రాజుగా అవుతాడని వివరిస్తున్నారు.

కాగా రాజమౌళి గత చిత్రాల్లో కూడా సెకండాఫ్ స్లో అవడం చూశాం.. చత్రపతిలో కూడా మొదటి హఫ్ లో అదరగొట్టగా.. సెకండ్ హఫ్లో తల్లి ఎమోషన్ తో కొంత సాగదీశారు. రాజమౌళి తీసిన యమదొంగ, సై మూవీల్లో కూడా ఫస్ట్ హఫ్ బాగుంటుంది. సెకండ్ హఫ్ లో కొంత బోరింగ్ కొనసాగుతుంది. ఇలా బాహుబలి2 లో కూడా కొంత సాగతీత కనిపించింది. ఇదొక్కటి తప్ప సినిమా అంతా సూపర్ గా వచ్చిందని.. వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా ఉందని చెబుతున్నారు.

To Top

Send this to a friend