బాహుబలి కమింగ్.. బన్నీ బ్యాక్..


దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ దువ్వాడ జగన్నాథమ్.. ఈ మూవీని మొదట మే 19న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా టీజర్ ను కూడా ఇటీవలే విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో వినోదం పంచారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ సినిమా మీద అంచనాలు రెట్టింపు చేశాయి. చిత్ర యూనిట్ ఇప్పుడు అభిమానులకు షాక్ ఇచ్చింది.

డీజే విడుదల ను రెండు నెలలు వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 27న బాహుబలి విడుదల కానుండడంతో ఆ ప్రభంజనం కు ముందు బన్నీ సినిమా రిలీజ్ అయితే కలెక్షన్లు రావని దిల్ రాజు టీం ఆలోచించింది. ఇంకా సినిమా పూర్తికాకపోవడంతో ఇప్పుడే రిలీజ్ చేసే పరిస్థితిలేదు. అందుకే బాహుబలితో పోటీపడడం ఇష్టలేక సినిమాను రెండు నెలలు వాయిదా వేస్తున్నట్టు సమాచారం.

దేశం గర్వించే సినిమా బాహుబలి. ఈ సినిమా దెబ్బకు ఏప్రిల్ 27న ఏ సినిమాను రిలీజ్ చేయడం లేదు. అటు హిందీలో, తమిళంలో, మళయాళంలో కూడా బాహుబలికి పోటీగా సినిమాలు విడుదల చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇంతటి తెలుగు సినిమాకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతోపాటు కలెక్షన్లు తగ్గకూడదని బన్నీ దువ్వాడ సినిమాను వాయిదా వేసినట్లు తెలిసింది.

To Top

Send this to a friend