బాహుబలి చుట్టూ తెలంగాణ రాజకీయం

తెలంగాణ అసెంబ్లీలో ఒకటే చర్చ.. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి చేసిన ‘బాహుబలి’ ప్రకటనపై ఎవరికీ వారు ఆపాదించుకొని సెటైర్లు వేసుకొని భలే పసందు రాజకీయాలు చేస్తున్నారు. జానారెడ్డి శనివారం సైతం అసెంబ్లీ లాబీల్లో ఈ ప్రకటన తెచ్చాడు.. ‘కాంగ్రెస్ నాయకుల్లో ఎవరైనా బాహుబలి కావచ్చు.. ఎవరికి వారే బాహుబలి అనుకుంటే తప్పేమీ లేదు. అప్పుడు కాంగ్రెస్ దే విజయం’ అన్నారు.

ఇక మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కాంగ్రెస్ కు బాహుబలి జానారెడ్డేనని అన్నారు. కాంగ్రెస్ లో చాలామంది బాహుబలిలు ఉన్నారని.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.

ఇక గద్వాల ఎమ్మెల్యే అరుణక్క కేసీఆర్ ను కట్టప్పతో పోల్చారు.. ‘కట్టప్ప లాంటి సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ లోనే ఒకరు బాహుబలిగా బలోపేతం అవుతారని’అన్నారు. బాహుబలి మొదటి భాగంలో కట్టప్ప వెన్నుపోటు పొడిచారని.. ఇప్పటిదాకా కేసీఆర్ చేసింది అదేనన్నారు. బాహుబలి రెండో భాగం వస్తుందని.. కట్టప్ప(కేసీఆర్) చరిత్రను ముంగిచేస్తామన్నారు.

ఇక దీనిపై స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి.. ‘అసలు కాంగ్రెస్ లో సత్తా ఉన్న బాహుబలి వంటివారెవరూ లేరని జానారెడ్డి వ్యాఖ్యలతో అంగీకరించినట్టు అయ్యిందని చెప్పారు. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే వారెవరూ కాంగ్రెస్ లో లేరన్న వాస్తవాన్ని జానారెడ్డి అంగీకరించారని.. సత్తాలేని వారంతా కాంగ్రెస్ లోనే ఉన్నారని ఆరోపించారు.

To Top

Send this to a friend