బాహుబలి భజన.. భళ్లాలను పట్టించుకోలే..

బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ అంతలా ఎలివేట్ అయ్యేడంటే.. విలన్ భళ్లాల దేవుడి కర్కశత్వమే కారణం.. విలన్ అంత బలంగా ఉండడమే హీరో ప్రభాస్ కు అంత హీరోయిజం రావడానికి కారణం.. నిజంగా నటన పరంగా చూస్తే ప్రభాస్, రానాలలో భళ్లలదేవుడిగా రానా నే జీవించాడు. కొన్ని సందర్భాల్లో ట్రైలర్లలో ప్రభాస్ తో పోల్చితే రానా హవభావాలు బాగున్నాయి. కానీ సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చే సరికి రానాకు ప్రాధాన్యం కరువైంది.

బాహుబలి2 ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో మొత్తం ప్రభాస్ భజనే ఉందని రానా అభిమానులు ఆగ్రహంతో సోషల్ మీడియాలో రగిలిపోతున్నారు. రాజమౌళి కానీ, తండ్రి విజయేంద్రప్రసాద్ , బాహుబలి నిర్మాతలు, కీరవాణిలు మొత్తం ప్రభాస్ ను ఆకాశానికెత్తేశారు. కానీ సినిమాలో ప్రభాస్ తో పోటీపడి నటించిన భళ్లాల దేవుడిని ఒక్కరు స్తుతించలేదు. దీంతో రానా అభిమానులు హర్ట్ అయ్యారు..

తమ అభిమాన నటుడి గురించి ఒక్కరు మాట్లాడలేదని.. కనీసం పొగడ్తలు కూడా కురిపించలేదని ఫ్యాన్స్ అంటున్నారు. అంతేకాదు బాహుబలిలో కీరోల్ పోషించిన కట్టప్ప సత్యరాజ్ , నాజర్ వంటి వారిపై కనీసం మాట్లాడిన పాపాన పోలేదు. కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడనేది కీలకంగా మారిన నేపథ్యంలో కనీసం సత్యరాజ్ అయినా పొగడాల్సి ఉన్నా రాజమౌళి అండ్ టీం మరిచి పోవడం విమర్శలకు తావిచ్చింది.

To Top

Send this to a friend