పప్పులు, ఉప్పులు కాదు.. సంచుల్లో బుల్లెట్లు


ఎవరైనా ఇంట్లో సంచుల్లో బియ్యం, పప్పు, ఉప్పు దాచుకుంటారు. కానీ అతడు గ్యాంగ్ స్టర్.. ఎప్పుడు ఎవరు అటాక్ చేస్తారో తెలియదు.. పోలీసుల బెడద ఉండనే ఉంది.అందుకే కొత్తగా ఆలోచించాడు. బియ్యం సంచుల్లో ఏకే 47 తుపాకులు, ఉప్పు, పప్పు దాచుకునే డబ్బాల్లో బుల్లెట్లను పెట్టాడు. ఇలా వందల కొద్దీ బుల్లెట్లు డబ్బాల్లో ఉన్నాయి. నయిం ఇంట్లో పోలీసులు సోదా చేసినప్పుడు బయటపడ్డాయట.. పోలీసులు రీసెంట్ గా నయిం ఇంట్లో సోదాలు చేసిన వీడియోను బయటపెట్డడంతో ఈ విషయం వెలుగు చూసింది.

నయిం ఎన్ కౌంటర్ అయిన తర్వాత అందరి జాతకాలు బయటకు వస్తున్నాయి. సోదాల సమయంలో పోలీసులు తీసిన వీడియోల్లో నయీం ఇల్లుఓ భయంకర మృత్యుపాశంగా కనిపించింది. వీడియోలో నయీం ఇంట్లో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. బుల్లెట్లకు లెక్కేలేదు. నయీం ఇంట్లోని ఒక బెడ్రూంలోనైతే ప్లాస్టిక్ కవర్లలో బుల్లెట్లు, బ్యాగులో ఏకే 47, పిస్టళ్లు ఉన్నట్లు వీడియోలో కనిపించింది.

అంతేకాదు నయీం ఇల్లు ఓ శత్రుదుర్భేద్యంగా ఉంది. నయీం ప్రధాన ఇంటితో పాటు స్థావరం వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. తన ఇంటి పరిసరాల్లో, దూరంగా వచ్చే వ్యక్తుల కదలికలు తెలుసుకునేందుకు నయీం వీటిని ఏర్పాటు చేాడు. సీసీటీవీని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మనుషులు, ఏర్పాట్లు కూడా చేశాడు. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.

To Top

Send this to a friend