అజయ్‌దేవ్‌గన్‌ ‘బాద్‌షాహో’ ట్రైలర్‌ రివ్యూ


బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌, సౌత్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఇలియానా జంటగా నటించిన ‘బాద్‌షాహో’ విడుదలకు సిద్దం అవుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా, ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలా ట్రైలర్‌ ఉంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇండియాలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ నడుస్తుందని ట్రైలర్‌ చూస్తుంటే అర్థం అవుతుంది.

ఇందిరగాంధీ ఇండియాలో ఎమర్జెనీ విధించిన సమయంలో కొన్ని ప్రదేశాల్లో దారుణాలు జరిగాయి. వాటిని అప్పటి ప్రభుత్వం మీడియా ద్వారా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాయి. వాటికి సంబంధించిన కొన్ని సంగతులను ఈ చిత్రంలో దర్శకుడు మిలన్‌ లూథ్రియా చూపించే ప్రయత్నం చేశాడు. అప్పటి పరిస్థితులు, అప్పటి వేష బాషలను కూడా చక్కగా చూపించి మెప్పించాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొదట శృతిహసన్‌ను ఎంపిక చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల శృతి తప్పుకుంది. శృతి తప్పుకోవడంతో అవకాశాలు లేక దిక్కులు చూస్తున్న ఇలియానాకు ఛాన్స్‌ దక్కింది. ఈ సినిమాతో ఇలియానా మరోసారి బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముద్దులకు పెట్టింది పేరైన ఇమ్రాన్‌ హష్మి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. భారీ స్టార్‌ కాస్టింగ్‌తో పాటు, 1975 పరిస్థితులు, వాతావరణం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడం ఖాయంగా కనిపిస్తుంది. చిత్రాన్ని సెప్టెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు.

To Top

Send this to a friend