రానాకు అపశకునం..

ఏదో జరగబోతోంది.. ఏంటి అపశకునం అనేలా దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్ పడింది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విడుదలకు ముందే ప్రకాశం జిల్లా చీరాలలోని నిర్మాత సురేష్ బాబు థియేటర్ లో అగ్రి ప్రమాదం జరిగింది. ఇదో అపశకునంలా సురేష్ బాబు, రానా భావిస్తున్నారట.. కొత్త సినిమాపై ఏదైనా ప్రభావితం చేస్తుందేమోనన్న ఆందోళన నెలకొంది. అందుకే థియేటర్ లో బయటా పూజలు నిర్వహించేందుకు సురేష్ బాబు, హీరో రానా రెడీ అయినట్టు సమాచారం.

ప్రకాశం జిల్లా చీరాలలోని సురేష్ మహల్ అనే థియేటర్ లో కూడా ఈరోజే ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సడన్ గా అందులో అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్య్కూట్ వల్ల రూ. 1.50 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా.. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత.. సురేష్ మహల్ యజమాని అయిన సురేష్ బాబు హుటాహుటిన తిరుపతి నుంచి చీరాల కు వచ్చి పరిశీలించారు. ఇటీవలే సురేష్ మహల్ థియేటర్ ను నిర్మాత సురేష్ బాబు భారీగా ఖర్చు పెట్టి ఫుల్ ఏసీ థియేటర్ గా మార్చారు. ఇంతలోనే ఉపద్రవం ఎదురుకావడంతో ఇప్పుడు తలపట్టుకుంటున్నారు.

దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ముందుచూపుతో ఏపీ, తెలంగాణల్లో చాలా చోట్ల సొంతంగా థియేటర్లు కట్టించాడు. ఆయనకు సినిమాలంటే ప్రాణం.. అందుకే భారతీయ భాషలన్నింటిలో ఆయన సినిమాలు తీసి గొప్ప నిర్మాతగా గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కారు. ఏపీలో, తెలంగాణలో దగ్గుబాటి ఫ్యామిలీకి చాలా సొంత థియేటర్లున్నాయి. వాటిల్లో రానా నటిస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ఇవ్వాళ రిలీజ్ అయ్యింది. అయితే ప్రకాశం జిల్లాలో మాత్రం సురేష్ మహల్ థియేటర్ లో ఇలా అగ్ని ప్రమాదం జరగడంతో అంతా అవాక్కయ్యారు.

To Top

Send this to a friend