బాబు కంటే వేగంగా కేసీఆర్ గిఫ్ట్


చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో… తను అనుకూల మీడియా అధినేత, సన్నిహితుడైన రామోజీకి భూములు కేటాయింపుపై తటపటాయించేవాడు. టీడీపీకి సపోర్టుగా ఉన్న ఈనాడు పత్రిక, ఆ ఎండీకి అప్పనంగా కేటాయించారని అపవాదు ఎందుకని మిన్నకుండిపోయారు.. ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తాయని ఆచితూచి భూములు కేటాయించలేదు.

కానీ ఇది కేసీఆర్ మార్క్ పాలన.. ఆయన అవునంటే అవును. కాదంటే కాదు.. అందుకే ఎవ్వరు ఎన్ని విమర్శలు చేసినా.. దుమ్మెత్తి పోసినా అనుకున్న పని చేసేస్తారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరం చేస్తానని కేసీఆర్ ఎప్పుడో చెప్పాడు కదా.. అందుకే ఇప్పుడు అదే పనిలో ప్రభుత్వ భూములను అప్పనంగా రామోజీరావుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశాడు… ఫిలింసిటీ అవసరాల కోసం భూములు కావాలని ఫిలింసిటీ కోరడం ఆలస్యం వెంటనే 295 ఎకరాలను ఇచ్చేందుకు నిర్ణయించారు. అంతేకాదు.. ఇందుకోసం అక్కడి భూములు, రైతులకు 37.65 కోట్లు చెల్లించాలని.. అందుకోసం డిపాజిట్ చేయాలని కేసీఆర్ సర్కారు ఫిలింసిటీ అధికారులను ఆదేశించింది.

ఎంత రేట్ అయినా సరే.. మీరు నిర్ణయించిన రేటుకే భూములు కొంటామని రామోజీరావు నేతృత్వంలోని ఫిలింసిటీ తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఫిలిం సిటీ అధికారులు అడిగిన భూమి కంటే ఎక్కువగా కేటాయించేందుకు నిర్ణయించడం గమనార్హం. ప్రస్తుతం ఈనాడు గ్రూపు టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో కేసీఆర్ ఈ పరోపకారం చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

To Top

Send this to a friend