బాబు నో, కేసీఆర్ ఓకే


మే 2 వ తారీఖుతో ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీకాలం ముగిసిపోతోంది.. మరి ఆయనకు మరోసారి అవకాశం దక్కుతుందా.? ప్రధాని మోడీ ఈ కాంగ్రెస్ పాలనలో నియమితులైన గవర్నర్ నరసింహన్ కు మరోసారి అవకాశం ఇస్తారా అన్నది చిక్కు ప్రశ్న..

గవర్నర్ నరసింహన్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ తర్వాత ఏపీలో రాష్ట్రపతి పాలన వచ్చినప్పుడు…, ఉమ్మడి ఏపీ విడిపోయినప్పుడు రాష్ట్రాన్ని సమర్ధవంతంగా పాలించారు. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి శభాష్ అనిపించుకున్నారు. ఇప్పటికీ నీతిగా నిజాయితీ స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా.. ఏపీ సీఎం చంద్రబాబుకు కంట్లో నలుసులా మారారు. తెలంగాణ బిల్లులకు, పలు ప్రతిపాదనలకు త్వరగా ఆమోదం తెలుపుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనలకు మోకాలడ్డుతున్నాడనే విమర్శలున్నాయి. దీంతో నరసింహన్ మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగుతాడా? దీనికి చంద్రబాబు అంగీకరిస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత సన్నిహితుడు.. ఈ మధ్య మంత్రివర్గణ విస్తరణ విషయంలో కానీ.. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారంలో కానీ గవర్నర్ పక్షపాతం చూపిస్తున్నాడని చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.. చాలా విషయాల్లో చంద్రబాబుకు-గవర్నర్ నరసింహన్ కు విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి గవర్నర్ గా నరసింహన్ ను కొనసాగించేందుకు చంద్రబాబు సుముఖంగా లేడనే ప్రచారం జరుగుతోంది..

మరోవైపు కేసీఆర్ మాత్రం తమ రాష్ట్రానికి గవర్నర్ గా నరసింహనే కావాలని నిన్నటి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీకి విన్నవించినట్లు తెలిసింది. రాష్ట్ర అభివృద్ధి విధాన నిర్ణయాలలో జాప్యం లేకుండా త్వరిత గతిన ఆమోదిస్తున్న గవర్నర్ నరసింహన్ కు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారట.. దీనికి మోడీ ఓకే చెప్పినట్టు సమాచారం. మరి నరసింహన్ కు ఏపీ, తెలంగాణకు కొనసాగిస్తారా.. లేక తెలంగాణకు మాత్రమే కొనసాగిస్తారా అన్నది వేచిచూడాల్సిందే…

To Top

Send this to a friend