బాబు, జగన్ రెడీనా.?


సంస్కరణల బాటలో ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు. నోట్ల రద్దు తర్వాత వడివడిగా అడుగులు వేస్తున్నారు. జీఎస్టీ సహా అన్ని బిల్లులను ఆమోదింపచేసుకుంటున్నారు. అందులో భాగంగా ఎన్నికల సంస్కరణలకు పచ్చజెండా ఊపారు. ఓకే దేశం-ఒకేసారి ఎన్నికలు అనే నినాదాన్ని సాకారం చేసేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా 2019లో సార్వత్రిక ఎన్నికలను 2018 నవంబర్ లోనే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయం రిలీవ్ అయ్యింది కాబట్టే ఓ పక్క కేసీఆర్.. మరో పక్క చంద్రబాబు నాయుడు ప్రజలపై వరాలు కురిపిస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండడంతో బాబు టీడీపీ నేతలు, శ్రేణులకు శుక్రవారం దిశానిర్ధేశం చేశారు.

అమరావతిలో చంద్రబాబు పార్టీ నేతలకు ముందస్తు ఎన్నికలు ఖచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారట.. 2018 నవంబర్ నాటికే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. పార్లమెంటు, అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారట.. అందుకే తెలంగాణలో కేసీఆర్ వరాల వాన కురిపిస్తున్నారని.. మనమూ ప్రజల్లోకి వెళ్లాలని పలు పథకాలను అమలు చేయాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల ఓ జిల్లాలో బహిరంగ సబ నిర్వహించాలని సూచించారట..

ముందస్తు ఎన్నికలు ఏపీలో కాకరేపుతున్నాయి. ముఖ్యంగా ఎన్నోరోజులుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న వైఎస్ జగన్ కు ఇంతకంటే మంచి తరుణం లేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే చంద్రబాబుపై ఈ మూడేళ్లలో ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని వైసీపీ ఎంతో చాకచక్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రతిదాన్ని రాద్ధాంతం చేసి ప్రజల్లో మార్కులు కొట్టేయడంలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారు. కాబట్టి వచ్చే సంవత్సరంలో జరిగే ఎన్నికలకు జగన్ పాదయాత్ర లాంటివి ట్రై చేస్తే జనంలో ఇంకా మైలేజ్ పొందవచ్చని విశ్లేషకులు ఆశిస్తున్నారు. చంద్రబాబు మాత్రం మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ సంకుల సమరంలో ఎవరు విజేతలో తెలియాలంటే వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే..

To Top

Send this to a friend