భారతీయ సినిమాకు పండుగవచ్చే..

కోటి .. 100 కోట్లు కాదు.. వెయ్యి కోట్లు.. భారతీయ సినిమా ఆ స్థాయిని అందుకుంటున్న మరుపురాని రోజులివి.. ఇన్నాళ్లు ఇంగ్లీష్ సినిమాలకే సాధ్యమైన 1000 కోట్ల కలెక్షన్లు.. ఒక భారతీయ సినిమా కేవలం 10 రోజుల్లోపే సాధిస్తుండడంతో యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరుస్తోంది..

బాహుబలి.. ఓ సంచలనంగా మారింది.. ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అమీర్ ఖాన్ నటించిన పీకే (792 కోట్లతో) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ దంగల్ (730 కోట్లు) రెండో స్థానంలో బాహుబలి1 (650 కోట్లు) మూడో స్థానంలో ఉన్నాయి.

కానీ ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు సాధ్యం కాని 1000 కోట్ల వసూళ్లు దిశగా రాజమౌళి చెక్కిన బాహుబలి2 దూసుకుపోతోంది. ఈ లక్ష్యాన్ని రేపోమాపో పూర్తి చేస్తుందని సినీ అనలిస్ట్ లు పేర్కొంటున్నారు.

బాహుబలి తొలి తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.925 కోట్లు సాధించిందని సినీ క్రిటిక్స్ పేర్కొంటున్నారు. ఏప్రిల్ 27న రిలీజ్ అయిన బాహుబలి2 8000 స్క్రీన్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది. ఇండియాలో ఈ సినిమా ఇప్పటివరకు రూ.745 కోట్లు గ్రాస్ సాధించింది. విదేశాల్లో రూ.180 కోట్లు సాధించింది. పదోరోజున మరో 75 కోట్లు సాధిస్తే ఇండియన్ సినిమా చరిత్రలోనే 1000 కోట్లు సాధించిన సినిమాగా బాహుబలి2 రికార్డులకెక్కడం ఖాయమని సినీ పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాహుబలి2 సినిమా గురించి.. సాధిస్తున్న వసూళ్ల గురించి ప్రపంచ ప్రఖ్యాత బీబీసీ చానల్ ప్రసారం చేసిన కథనాన్ని కింది వీడియోలో చూడొచ్చు..

To Top

Send this to a friend