అయ్యో బాలయ్య.. చూసే వారే కరువయ్యారా.?


బాలయ్య నటించిన లెజండ్ మూవీని తెలుగులోని ఓ టాప్ ఎంటర్ టైన్ మెంట్ చానల్ భారీ రేట్లకు కొన్నది.. ఆ సినిమాను ప్రసారం చేస్తే.. టీఆర్పీ రేటింగ్ బాగా వచ్చాయి. 11.27 రేటింగ్ తో బుల్లితెరలో అదరగొట్టింది. ఫ్యాక్షన్/ యాక్షన్ .. బాలయ్య బాబు డైలాగ్స్ , బోయపాటి డైరెక్షన్, జగపతి బాబు విలనిజం.. మొత్తంగా మాంచి మసాల కథతో లెజండ్ సినిమా బాగా ఆడింది. బుల్లితెరపై కూడా అంతే బాగా జనాన్ని చూశారు.

కానీ చారిత్రక కథాంశంతో తెరకెక్కిన బాలయ్య 100 చిత్రం విషయంలో ఈ అంచనా తప్పింది. ఆ సినిమా థియేటర్లలో లాగే బుల్లితెరలో కూడా వీక్షకులు లేక వెలవెలబోయింది. ఆయన బలమైన యాక్షన్ ఫ్యాన్స్ సినిమాను టీవీలో కూడా చూడలేకపోయారు. సాధారణ ప్రేక్షకుడిని శాతకర్ణి టీవీలో కూడా ఆకట్టుకోలేకపోయింది. బాలయ్య కత్తిపట్టి తొడగొడితే.. సీమ పౌరుషం చూపిస్తే యాక్సెప్ట్ చేసిన జనం .. పౌరాణిక కథల్లో ఒదిగిపోతే చూడలేకపోయారు. శాతకర్ణిని థియేటర్లలో చూడని యాక్షన్ అభిమానులు కనీసం బుల్లితెరపై వచ్చినా చూస్తారని భారీ రేట్లకు కొన్న మాటీవీ యాజమాన్యం ఇప్పుడు సినిమాకు వచ్చిన టీఆర్పీ రేటింగ్ చూసి షాక్ తిన్నదట..

ఉగాది సందర్భంగా గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ బుల్లితెర మాటీవీలో ప్రసారమైంది. ఈ సినిమాకు దాదాపు 7 కోట్లకు పైగా చెల్లించి శాటిలైట్ రైట్స్ కొన్న ఆ సంస్థ ఆ స్థాయిలో లాభాలు సాధించలేకపోయింది. ఉగాది ప్రీమియర్ గా వచ్చిన శాతకర్ణి మూవీకి టీఆర్పీ రేట్స్ దారుణంగా పడిపోయాయి. ఈ సినిమా టీఆర్పీ 5.5కే పరిమితమైపోయింది. బాలయ్యను ఎలా చూడాలో ఆ సినిమా అలా లేకపోవడంతో ఆయన్ను అభిమానించే ఒక వర్గం వారు శాతకర్ణిని చూడడానికి ఇష్టపడలేదు. సినిమా థియేటర్లో వేసినా.. బుల్లితెరపై వేసినా శాతకర్ణి రాత మారలేదు..

To Top

Send this to a friend