నరసింహారెడ్డితో చిరంజీవి స్టామినా అదుర్స్..

చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు ఆయన నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా-నరసింహారెడ్డి’ చిత్రం మోషన్ పోస్టర్, టీజర్ ను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ చూశాక అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కర్నూలులోని ఓ భారీ కోటపై తగలబడుతున్న బ్రిటీష్ జెండా.. కింద భారతీయులు, బ్రిటీష్ సైనికుల మృతదేహాలు, కోటలో యుద్ధం, కింద గుట్టలపై నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి కత్తి, బాణం చేతబట్టి ఉన్న మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇందులో నటిస్తున్న అద్భుత టెక్నిషియన్స్ నటుల పేర్లు కూడా వెల్లడించారు.

ఈ టీజర్ పోస్టర్ చూశాక అంచనాలు పీక్స్ లోకి పెరిగిపోయాయి. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సిందే.. ‘సైరా-నరసింహారెడ్డి’ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అయిన కేవలం 8 నిమిషాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ సెట్ చేసింది. ఆల్ టైం హిస్టారికల్ రికార్డును నెలకొల్పింది. టాలీవుడ్ చరిత్రలోనే ఇంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అయిన ఫస్ట్ లుక్ మరొకటి లేదని విశ్లేషకులు చెబుతున్నారు..

దాదాపు 9 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా ఖైదీనంబర్ 150 తీశారు.
తమిళ కత్తిని రిమేక్ చేసి తెలుగులో మరోసారి మెగాస్టార్ తన స్టామినాను నిరూపించారు. ఇప్పుడు తన 151వ సినిమాగా చరిత్రదాచిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎంచుకొని ‘సైరా-నరసింహారెడ్డిగా’ చిరంజీవి సినిమా తీస్తున్నారు. ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు కానుకగా విడుదల చేసిన మోషన్ పోస్టర్, టీజర్స్ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను సంభ్రమాశ్చారాలకు గురిచేశాయి.

To Top

Send this to a friend