అవినీతిలో బాబే నంబర్ 1 అట


మాట ఒక తూటా.. తూటా విసిరితే వెనక్కి తీసుకోనట్టే.. మాట తూలినా అంతే.. అదీ భావి తరాలకు రికార్డ్ అయ్యే ఏపీ అసెంబ్లీలో మాట తూలితే అంతే సంగతులు.. కానీ చంద్రబాబు దారుణంగా మాట తూలాడు. ‘అవినీతిలో, అభివృద్ధిలో ఏపీ నంబర్ 1 ’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయకుడు అసెంబ్లీలో అనడం దుమారం రేపింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ప్రతి సందర్భాన్ని.. అధికార పక్ష నాయకుల అసంబద్ధ చర్చను, ప్రజాసమస్యలను లేవనెత్తి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో ఫస్ట్రేషన్ లో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. అందులో భాగంగా అవినీతిలో, అభివృద్ధిలో నంబర్ 1 అని తన ప్రభుత్వాన్ని తానే కించపరుచుకున్నాడు.

దీనిపై పత్రికల్లో, చానాళ్లలో దుమారం రేగడంతో చంద్రబాబు అసెంబ్లీ స్పీకర్ అనుమతితో తాను తప్పుగా అన్నానని.. దాన్ని రికార్డుల్లోంచి తీసేసి సవరించాలని కోరారు. దీనికి సరేనని స్పీకర్ కోడెల సమాధానమిచ్చారు.. అసలు తాను ‘అవినీతిని అంతమొందించడంలో.. అభివృద్ధిలో ఏపీ నంబర్ 1 అని’ అనడానికి బదులు తొందర్లో అలా అన్నానని బాబు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ఈ విషయంలో రాద్దాంతం చేయడంపై మండిపడ్డారు. తన 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంత దివాళాకోరుతనం వైసీపీ పార్టీని చూడలేదని వాపోయారు. వైసీపీ వాళ్ల ప్రవర్తన వల్ల కోపం, విసురు వస్తున్నాయని అందుకే మాటలు తూలుతున్నాయని వాపోయారు చంద్రబాబు..

ఇలా వైసీపీ ధాటికి అసెంబ్లీలో బాబుకు ఫస్ట్రేషన్ పెరిగిపోతోందట.. ఎప్పుడు ఏం అంటున్నాడో.. ఏం మాట్లాడుతున్నాడో తెలియనంతగా జగన్ ఇబ్బందులు పెడుతున్నాడట.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ బాబుకు నిద్రలేకుండా చేస్తున్న అసలైన ప్రతిపక్షంగా సమర్థవంతంగా తన పాత్ర పోషిస్తున్నాడని తోటి ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు.

To Top

Send this to a friend