ఆస్ట్రేలియా సిరీస్ నుంచి కొత్త పాఠాలు


మొదటి టెస్ట్ లో ఇండియా ఓడిపోగానే.. ఆస్ట్రేలియాను అందరూ పొగిడారు. ఆ పొగడ్తలతో పాటు ఆస్ట్రేలియా కూడా ఇండియాకు చుక్కలు చూపింది. టెస్టుల్లో నంబర్ 1 ర్యాంకులో ఉన్న ఇండియా అప్పటికే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండిస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లను ఓడించి అప్రతిహత జైత్రయాత్రను కొనసాగించింది. కానీ ఆస్ట్రేలియా మాత్రం తొలిటెస్టులోనే ఇండియా ఓడించి దెబ్బతీయడంతో ఇండియాకు తత్వం బోధపడింది..

రెండో టెస్ట్ నుంచి భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా ఇండియన్ కెప్టెన్ కోహ్లీ ఈసిరిస్ లో రాణించకపోయినా బ్యాటింగ్ లో పూజారా, కేఎల్ రాహుల్, రహానే రాణించడంతో భారీ స్కోర్లు సాధ్యమైంది. దీంతో పాటు బౌలర్లు అశ్విన్, జడేజా, ఉమేశ్ యాదవ్.. చివరి టెస్టులో కులదీప్ ఇలా అందరూ చెలరేగిపోయారు. ఇలా హోరాహోరీగా పోరాడిన ఆస్ట్రేలియాను రెండు, నాలుగో టెస్టులో ఓడించారు. మూడో టెస్టులో మాత్రం ఆస్ట్రేలియా గొప్పగా పోరాడి డ్రా చేసింది..

కానీ ఆస్ట్రేలియా తో సిరీస్ ఆ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ లో విశేషంగా రాణించాడు. దాదాపు 4 సెంచరీలు చేశాడు. డీఆర్ఎస్ వివాదంలో ఇరుకున్న స్మిత్ ఆ కసితో చెలరేగాడు. కానీ చివరిటెస్టులో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను చుట్టేశారు. దీంతో మొత్తానికి బలమైన ఆస్ట్రేలియాను ఓడించిన ఇండియా టెస్టుల్లో నంబర్ 1 ర్యాంకును సార్థకం చేసుకుంది.

To Top

Send this to a friend