పవన్‌ పై విషంతో హత్య యత్నం


గత కొన్ని రోజులుగా ప్రముఖ ఛానెల్‌లో సెలబ్రెటీల గత జన్మల రహస్యాల గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్‌ ఎస్వీనాగనాథ్‌ చెబుతూ వస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే రాజమౌళి, అల్లు అర్జున్‌ వంటి స్టార్స్‌ గత జన్మ రహస్యాలను మీడియా ముందుకు తీసుకు వచ్చిన నాగనాథ్‌ తాజాగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ గత జన్మ విశేషాలను చెప్పుకొచ్చాడు. పవన్‌కు సంబంధించిన ఏ విషయమైనా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తిని కలిగిస్తుంది. ఇక గత జన్మ విషయం అంటే సర్వత్రా ఉత్కంఠను రేకెత్తించడం ఖాయం.

అల్లు అర్జున్‌ను గత జన్మలో రైతు అని చెప్పిన నాగనాథ్‌ తాజాగా పవన్‌ కళ్యాణ్‌ను మాత్రం గత జన్మలో రాజుల వంశంకు చెందిన వాడిగా చెప్పుకొచ్చాడు. రాజుల కుటుంబంకు చెందిన పవన్‌ కళ్యాణ్‌ అప్పట్లో ధాన ధర్మాలు ఎక్కువగా చేసేవారట. దాంతో అది గిట్టని రాజకుటుంబంకు చెందిన ఇతర సభ్యులు పవన్‌ను గత జన్మలో విష ప్రయోగం చేసి అనారోగ్యంకు గురి చేశారని, దాంతో కొన్ని సంవత్సరాలకే మృతి చెందినట్లుగా నాగనాథ్‌ చెబుతున్నారు. గత జన్మలో కూడా పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిల్లు చేసుకున్నట్లుగా చెబుతున్నాడు.

పవన్‌ కళ్యాణ్‌ గత జన్మ విశేషాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. నాగనాథ్‌ చెబుతున్న గత జన్మ రహస్యాల్లో నిజం ఎంతుందో తెలియదు కాని ప్రస్తుతం టాలీవుడ్‌ మొత్తం ఈయన వైపు ఆసక్తిగా చూస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు సాదారణ జనాల గత జన్మ విశేషాలను కూడా ఈయన ఇట్టే చెప్పేస్తున్నాడు.

To Top

Send this to a friend