ఏటీఎం, బ్యాంకు సేవల బాదుడు మొదలైంది..


బ్యాంకింగ్ సేవలపై జీఎస్టీ ప్రభావంతో వినియోగదారుడిపై బాదుడు మొదలైంది. ఇన్నాళ్లు ఏటీఎం ఉపయోగించినా.. బ్యాంకులో డబ్బులు వేయడం తీసినా సర్వీస్ ట్యాక్స్ 15శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడు జీఎస్టీ రావడంతో 18శాతానికి ఈ సేవలు మారనున్నాయి. ముఖ్యంగా ఏటీఎం సేవలు వినియోగదారులకు భారం కానున్నాయి.

ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న నగదు డిపాజిట్, ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్, డిబిట్ కార్డులు, బీమా ప్రీమియం, ఈఎంఐ చెల్లింపులపై 15శాతం సేవా పన్నును వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో భాగంగా బ్యాంకులు ఒక్కో వినియోగదారుడికి ప్రస్తుతం ఏటీఎంలో , ఇతర బ్యాంకు లావాదేవీల్లో ఐదింటివరకు ఉచితంగా అందిస్తున్నాయి. ఆ లావాదేవీలు ముగిసిన తర్వాత రూ.100 ప్రతి బ్యాంకింగ్ లావాదేవీకి, ప్రతి కస్టమర్  రూ.3 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మేరకు ఎస్.బీ.ఐ, హెచ్.డి.ఎఫ్.సి, స్టాండర్డ్చార్టర్డ్ బ్యాంకులు సహా మారిన రేట్లను జీఎస్టీ పరిమితిని తెలియజేస్తూ వినియోగదారులకు ఇప్పటికే మెసేజ్ లు పంపాయి. ఇక నుంచి ఎక్కువ సార్లు ఏటీఎం వాడినా, డబ్బులు తీసినా కానీ వినియోగదారుడిపై భారం పడక తప్పదు..

To Top

Send this to a friend