అశోక్ గజపతిపై దాడి


శివసేన ఎంపీల ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. గల్లీల్లో చేసినట్టు ఢిల్లీలోని పార్లమెంటులో ప్రవర్తించారు. మతతత్వంతో చెలరేగిపోయారు. పార్లమెంటులో గురువారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. దేశ అత్యున్నత చట్టసభ సాక్షిగా శివసేన ఎంపీలు దాదాగిరి చేశారు. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుపై చేయిచేసుకునేందుకు ప్రయత్నించారు.

ఎయిర్ ఇండియా ఉద్యోగిపై గతంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వైడ్ చెప్పుతో దాడి చేశారు. దీనిపై ఎయిర్ ఇండియా ఆగ్రహించి ఆయన్ను తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించింది. దీనిపై పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు నిషేధం ఎత్తివేసేందుకు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తిరస్కరించారు. దీంతో శివసేన ఎంపీలు ఆగ్రహంతో ఊగిపోయారు. అశోక్ గజపతి రాజును కొట్టేందుకు చుట్టుముట్టి తోసేశారు.

గురువారం గైక్వౌడ్ పార్లమెంటులో మాట్లాడుతుండగానే మరో శివసేన ఎంపీ అనంత్ గీతే కల్పించుకుని ‘ఎలాంటి విచారణ జరపకుండానే ఎయిర్ ఇండియా ఎలా నిషేధం విధిస్తుంది అంటూ అశోక్ గజపతి రాజును కొట్టేందుకు చేయి లేపడంతో అశోక్ గజపతి రాజు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు.. దాదాపు బాహాబాహీ దిగే పరిస్థితి కనిపించడంతో సహచర బీజేపీ మంత్రులు అశోక్ చుట్టూ రక్షణగా నిలబడ్డారు. ఈ ఘటనపై కేంద్రమంత్రులు, స్పీకర్, ఎంపీలు విస్మయం వ్యక్తం చేశారు.

కాగా ఈ సందర్భంగా శివసేన ఎంపీ ‘ముంబైలో ఒక్క విమానం ఎగరనీయం’ అని సవాల్ విసిరారు. ఈ సమస్యను అందరితో మాట్లాడి విమానయాన శాఖ మంత్రి పరిష్కరిస్తారని కేంద్ర హోంమంత్రి హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమనిగింది.
కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై దాడి చేసిన దృశ్యాలను కింద వీడియో లింక్ లోచూడొచ్చు..

To Top

Send this to a friend