ఆశిష్ రాజ్ రెండో చిత్రం త్వ‌ర‌లో ప్రారంభం

ఆక‌తాయి చిత్రంతో ఆక‌ట్టుకొన్న క‌థానాయ‌కుడు ఆశిష్ రాజ్‌.  తొలి సినిమాతోనే డాన్స్‌, యాక్ష‌న్‌, న‌ట‌న‌… ఇలా అన్ని విభాగాల్లోనూ త‌న ప్ర‌తిభ చాటుకొన్నాడు. ఇప్పుడు రెండో చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడు. ఆక‌తాయి నిర్మించిన వికెఏ ఫిల్మ్స్ ఈ చిత్రాన్నీ రూపొందించ‌నుంది. సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ముంబైకి చెందిన సిమ్ర‌న్ ఈ చిత్రంతో క‌థానాయిగా ప‌రిచ‌యం కానుంది. ఈనెల‌లోనే ముహూర్తం జ‌రుపుకొని, జులైలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు విజ‌య్‌, కౌశ‌ల్‌, అనిల్ మాట్లాడుతూ “ఆశిష్ రాజ్ కోసం చాలా క‌థ‌లు విన్నాం. అందులో సుబ్ర‌హ్మ‌ణ్యం చెప్పిన ఈ క‌థ బాగా న‌చ్చింది. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ నేప‌థ్యంలో జ‌రిగే ప్రేమ క‌థ ఇది. వినోదం, యాక్ష‌న్‌, థ్రిల్ ఇలా అన్నింటికీ చోటుంది. బ‌డ్జెట్ పరంగా, క్వాలిటీ ప‌రంగా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. అంద‌మైన లొకేష‌న్ల‌లో పాట‌ల్ని పూర్తి చేస్తాం. మూడు షెడ్యూళ్ల‌లో ఈ సినిమాని పూర్తి చేసి ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేస్తాం. మిగిలిన న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాం“ అన్నారు.

సంగీతం:  సాయి కార్తీక‌
ఛాయాగ్ర‌హ‌ణం:  ప్ర‌సాద్ జీకే
పీఆర్వో:  వంశీ శేఖ‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  అనిల్ భాను
నిర్మాత‌లు:  విజ‌య్‌, కౌశ‌ల్‌, అనిల్
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  సుబ్ర‌హ్మ‌ణ్యం

To Top

Send this to a friend