రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్న ‘బాహుబలి’ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెల్సిందే. సౌత్ నుండి బాలీవుడ్ వరకు దాదాపు అందరు స్టార్స్ కూడా సాహో బాహుబలి అంటూ ప్రశంసించిన వారే. ఇప్పుడు తాజాగా ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రహమాన్ ‘బాహుబలి’పై స్పందించి ప్రశంసల జల్లు కురిపించాడు.
తాజాగా చెన్నైలో ‘బాహుబలి 2’ చిత్రాన్ని చూసిన ఏఆర్ రహమాన్ స్పందిస్తూ ఈ సినిమా 2000 కోట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒక గొప్ప సినిమాను మీరు ప్రేక్షకులకు అందించారు. సౌత్ సినీ పరిశ్రమ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మీరు విస్తరించారు అంటూ ఏఆర్ రహమాన్ ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది. ఈ సినిమా ఇప్పటికే 1500 కోట్లు దాటిన నేపథ్యంలో మరో అయిదు వందల కోట్లు ఏఆర్ రహమాన్ అన్నట్లుగా సాధిస్తుందేమో చూడాలి.
ఎంత మంది సినీ ప్రముఖులు ప్రశంసలు దక్కించుకున్నా కూడా ఆస్కార్ అవార్డును దక్కించుకున్న ఏ ఆర్ రహమాన్ ప్రశంసలతో రాజమౌళి మురిసి పోయాడు. రహమాన్ ప్రశంసలకు జక్కన్న సంతోషం వ్యక్తం చేశాడు. ఒక మంచి ప్రయత్నంకు గొప్ప వారి నుండి ప్రశంసలు దక్కితే అంతకు మించి ఏముందని సన్నిహితుల వద్ద రాజమౌళి అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి తన తర్వాత సినిమా పనిలో పడ్డట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
