అర్జున్ రెడ్డి కలెక్షన్ల సునామీ..

విజయ్ దేవరకొండ, శాలిని పాండే జోడిగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి ‘ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ కలెక్షన్ల తో దూసుకెళ్తున్నది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబడుతున్నట్టు సినీ విశ్లేషకులు వెల్లడించారు.

అర్జున్ రెడ్డి ఈ నెల 25న విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించడమే కాక , నాలుగు రోజుల్లో అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిందని మూవీ ట్రాకర్ రమేష్ బాలా ట్విటర్ ద్వారా తెలిపారు. అర్జున్ రెడ్డి మూవీ విడుదలైన 4 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.27.6 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.47.34 కోట్లను వసూల్ చేసినట్లు తాజా సమాచారం. దాదాపు 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ అంతకు 15 రెట్లు వసూళ్లు రావడంతో సినిమా యూనిట్ సంతోషంగా ఉందట..

అర్జున్ రెడ్డి.. ఓ స్వీట్ ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ యూత్ గుండెలను పిండేస్తోంది. మెడికో స్టూండెంట్ల మధ్య జరిగిన ఈ ప్రేమకథపై కాసుల వర్షం కురిసింది. దీనిపై ప్రముఖ సినీ విశ్లేకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడం గమనార్హం. ‘అర్జున్ రెడ్డి మూవీ అద్భతమైన కథాంశంతో తెరకెక్కెంచారు. ఈ మూవీ చూసేందుకు ఎక్సైటింగ్ వెయిట్ చేస్తున్నా అర్జున్ రెడ్డిని ఇంగ్లీష్ సబ్ టైటిల్ తో ముంబైలో రిలీజ్ చేస్తారా.!” అని చిత్రం యూనిట్ ను కోరారు.

To Top

Send this to a friend