బిగ్ బాస్ లో దొంగతనం..

అర్చన బిగ్ బాస్ హౌస్ లో నిన్న దొంగతనం చేసింది. మొన్ననే ఓ బర్గర్ ను దొంగతనం చేసి గుట్టుగా తిన్న అర్చన అన్ని కెమెరాలు చూస్తున్నాయన్న విషయాన్ని మరిచిపోయింది. ఇక నిన్న హరితేజ-శివబాలాజీకి ఇచ్చిన సీక్రెట్ ‘కోతులు ఆడించే టాస్క్’లో బిగ్ బాస్ హరితేజకు ఇచ్చిన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్లను అర్చన దొంగచాటుగా ఎత్తుకెళ్లడం కెమెరా కంటపడింది. అనంతరం దుప్పటి కింద ఆమె తినడం బిగ్ బాస్ చూసేశాడు.

హరితేజ తప్ప ఎవరూ తినకూడదని చెప్పినా అర్చన దొంగతనం చేయడంతో ఆమెను బిగ్ బాస్ నిన్న ఆట పట్టించారు. మొత్తంగా బిగ్ బాస్ హౌస్ లో తొలిసారి తిండికోసం దొంగతనం చేసిన సెలబ్రెటీగా అర్చన పేరు ప్రస్తుతం మారుమ్రోగిపోతోంది..

ఇక ప్రతిరోజు చిన్న చిన్న విషయాలకే అర్చన అలుగుతోంది. తన గురించే మాట్లాడుకుంటున్నారని ఆరోపిస్తోంది. అర్చన పెట్టే నసను చూసి మిగతా సెలబ్రెటీలందరూ నవ్వుకుంటూ ఆమెపై మండిపడుతున్నారు. ఇక బిగ్ బాస్ కూడా అర్చన చేష్టలకు విసిగి ఆమెను సరదాగా టాస్క్ లప్పుడు ఆడుకుంటుండడం విశేషం..

To Top

Send this to a friend