అప్పుడు తప్పు చేశా.. ఇప్పుడు చేయను


2004 ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరగాల్సిన సమయం.. కానీ చంద్రబాబు ఆ సమయంలో సవంత్సరం ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్లు బాంబులు పేల్చారు. ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ సానుభూతి పనిచేస్తుందని సంవత్సరం ముందే ఎన్నికలకు వెళ్లారు. కానీ దెబ్బైపోయాడు. కరువు కాటకాలు.. చంద్రబాబు హైటెక్ హంగుల పాలనను జనం తిరస్కరించారు. పాదయాత్రతో జనం సమస్యలను రాష్ట్రమంతా తిరిగి చూసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎం చేశారు.

ఆ ఎన్నికల ఓటమిని చంద్రబాబు ఇంకా మరిచిపోలేదు. అందుకే అమరావతిలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఎన్నికలపై తన మనసులోని మాటను బయటపెట్టారు. ‘‘2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి తప్పు చేశానని.. ఇప్పుడు చేయనని’’ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు తాను వ్యతిరేకమే అయినా ప్రధాని మోడీ జమిలి ఎన్నికలకు వెళితే మాత్రం ఎదుర్కోక తప్పదన్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రతి మూడు నెలలకోసారి ఎన్నికలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కావడం లేదు. అందుకే ప్రధాని ఈ ప్లాన్ చేశారు. కానీ ముందస్తుతో కొంత ఇబ్బందే అని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు..

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోందని సర్వేల్లో తేలింది. కాపు రిజర్వేషన్లు, అభివృద్ధి విషయంలో ఆయా వర్గాలు ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు ఏపీలో అధికారం సాధించడం కోసం ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి పరాభవం ఎదురైతే సంవత్సరం పాలన కూడా కోల్పోతామనే ఆందోళన చంద్రబాబులో నెలకొంది. అందుకే ముందస్తుకు తాను సుముఖంగా లేనని స్పష్టం చేశారు.

To Top

Send this to a friend