ఈ తప్పు జగన్ ది కాదు.. చంద్రబాబుదా.?

 

ఒకటి కాదు రెండు వందల కోట్లు ఖర్చు.. అంతా ప్రజాధనమే.. ఆగమేఘాల పేరిట ప్రభుత్వ ధనాన్ని పప్పు బెల్లాల్లా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ నాసిరకం నిర్మాణాలు చిన్నపాటి వర్షానికే ఊరుస్తున్నాయి. వెరసి చంద్రుడి అమరావతిలోని వెలగపూరి సచివాలయం వర్షపు నీటితో నిండిపోయింది. తొలకరి జల్లులకే అసెంబ్లీ భవనంలో నీరుగారితే.. ఇప్పుడు చిన్న వర్షానికే తాత్కాలిక సచివాలయంలో నీరుగారడమే కాకుండా పెచ్చులు ఊడిపడటంతో సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

తాత్కాలిక అసెంబ్లీలో గోడలు కూలి.. వైఎస్ జగన్ చాంబర్ లో నీరు కారితే అది కుట్రకోణమని స్పీకర్, చంద్రబాబులు కలిసి నెపాన్ని వైఎస్ జగన్ పై తోసేశారు. వైసీపీ నాయకులే ఇలా చేశారని ఆరోపించారు. ఎవరో వచ్చి పైపు కోసేసారని దుయ్యబట్టారు. ఇప్పుడా చాన్స్ లేదు. జగనే వర్షపు నీరును సచివాలయంలోకి తోసేసాడని కుట్ర చేశాడని చెప్పడానికి లేదు. ఎందుకంటే అది వందల మంది ఉద్యోగులు పనిచేసే సచివాలయం.. ఎప్పుడు నిరంతరం నిఘా ఉంటుంది. అక్కడికి జగన్ రాలేడు .. వైసీపీ కార్యకర్తలూ దూరలేరు. అయినా ఇప్పుడు సచివాలయం పెచ్చులూడిపోయింది. వానకు ఊరుస్తోంది. నీటితో సచివాలయంలోని మూడు నాలుగు బ్లాకుల్లో పలుచోట్ల వర్షపు నీరు లీకయ్యింది. పిల్లర్లు, కిటీకీల నుంచి కూడా వర్షం నీరు లోపలికి వచ్చింది. నాలుగో బ్లాకులోని మంత్రుల చాంబర్లు, పేషీలు వర్షపు నీటితో తడిసిముద్దయ్యాయి..

ఓ వైపు తాత్కాలిక సచివాలయంలో చిన్న వర్సానికి ఊరవడం, నీల్లు రావడం చూసి ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు నాసిరకం నిర్మాణాలతో ఎప్పుడు భవనాలు కూలుతాయో తెలియని పరిస్థితి. అసెంబ్లీలో నీటి లీకేజీని ప్రతిపక్షంపై తోసిసిన ప్రభుత్వం ఇప్పుడు నెపాన్ని ఎవరిమీద తోసేయాలో తెలియక తికమకపడుతోంది. దీనికి వరుణుడినే చంద్రబాబు బాధ్యడిని చేస్తాడో చూడాలి మరి..

వానదేవ చంద్రబాబు నీ మీద నెపాన్ని మోపకముందే.. అమరవాతి చుట్టపక్కల నుంచి జంప్ అవ్వు స్వామీ..

To Top

Send this to a friend