ఏపీ ఎంపీ చిందిస్తే ఎలా గుంటదో తెలుసా..

ఆయన ప్రజాప్రతినిధి.. పార్లమెంటు మెంబర్.. అయితే తండ్రి అకాల మరణంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. 25 ఏళ్లకే తండ్రిపై ఉన్న సానుభూతి పవనాలు వీచి ఎంపీ అయ్యారు. ఎంపీ అయ్యాక మూడేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారు. శ్రీకాకుళం ఎంపీ పెళ్లి వేడుక ఇప్పుడు అంగరంగ వైభవంగా జరుగుతోంది.

టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పెళ్లి వేడుక అదిరిపోతోంది. 3 రోజుల పెళ్లిలో భాగంగా అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ కార్యక్రమంలో యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన కాబోయే భార్యతో కలిసి ‘బంతిపూల జానికి’ పాటకు స్టెప్పులేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ లా మారింది. చాలా ఫర్ ఫెక్ట్ గా ఉన్నది ఉన్నట్టు ఎన్టీఆర్ స్టెప్పులను ఎంపీ వేసి అదుర్స్ అనిపించారు. మరో రెండు రోజుల్లో రామ్మోహన్ నాయుడు వివాహం జరగనుంది.

విశాఖకు చెందిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తె శ్రావ్యను ఎంపీ రామ్మోహన్ పెళ్లిచేసుకోబోతున్నారు. మార్చిలో వీరికి నిశ్చితార్థం జరిగింది. ఎంపీ రామ్మోహన్ ఆయన భార్య కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend