ఏపీమే సవాల్.. నేనూ రెడీ..


ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ముందస్తు ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. మరోవైపు ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు సై సై అన్నాడు. దీంతో రాజకీయ వేడి ఏపీలో మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లలోపే సమయం ఉండడంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది. దీంతో జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ఈరోజు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

‘ఎన్నికల యుద్ధం ఒకవేళ ముందస్తుగా వస్తే.. జనసేన సిద్ధమే’ అని పవన్ కళ్యాణ్ ఈరోజు ట్వీట్ చేశారు. దీంతో కాక రేగింది. ప్రస్తుతం పవన్ అనంతపురం నాయకుల రిక్రూట్ మెంట్ లో బిజీగా ఉన్నారు. అనంతపురం తర్వాత శ్రీకాకుళం, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాల్లో నేతల ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభించబోతున్నట్టు పవన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఏపీ మొత్తం నాయకులు, కార్యవర్గాలను వచ్చే నాలుగు నెలల వ్యవధిలో పూర్తి చేసి ఆర్నెలల్లో రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసేందుకు జనసేన అధినేత పవన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలపై సుదీర్ఘ చర్చలు జరిపిన పవన్ ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది.

వచ్చే ఆరు నెలల్లో కమిటీలు పూర్తి చేసి 2018 మొదట్లో ప్రజల ముందుకు వెళ్లాలని సంవత్సరంలో ఏపీ మొత్తం పర్యటించి ప్రచారం చేయాలని పవన్ భావిస్తున్నారు. ఏడాదిలో ప్రతి గడపను తాకి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే జనసేన ముందస్తు ఎన్నికలకు సిద్ధం అని పవన్ ప్రకటించడంతో ప్రత్యర్థులకు హెచ్చరికలు చేసినట్టు అయ్యింది.

To Top

Send this to a friend