ఏపీ మంత్రులు-వారి శాఖలు


ఏపీ మంత్రివర్గ విస్తరణ ఘట్టం ముగిసింది.. అసంతృప్తుల బుజ్జగింపులు పూర్తయ్యాయి. ఆగ్రహావేశాలు చల్లారాయి. దీంతో సీఎం చంద్రబాబు కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. మంత్రివర్గంలోకి కొత్తగా 11 మంది చేరగా.. ఐదుగురు మంత్రులు ఉద్వాసనకు గురయ్యారు. దీంతో మొత్తం అందరికి శాఖలను చంద్రబాబు అటూ ఇటూ మార్చేశారు. కొందరికి ప్రమోషన్, కొందరికీ డిమోషన్ ఇచ్చేశారు… ఫర్ ఫెక్ట్ మనిషి అని పేరుతెచ్చుకున్న సోమిరెడ్డికి కీలక వ్యవసాయ శాఖ ఇచ్చారు. ఎందుకంటే ఏపీ జనాభాలో ఎక్కువ శాతం రైతులు, కూలీలే ఉండడంతో వారికోసం సమర్థుడైన సోమిరెడ్డికి ఆ శాఖ కేటాయించారు. పత్తిపాటి పుల్లారావుకు ప్రమోషన్ కల్పించి పౌరసరఫరాల శాఖ కేటాయించారు. ఇక కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన అనుభవం లేని భూమా అఖిలప్రియకు తేలికైన టూరిజం శాఖను ఇచ్చారు. సీఎం కొడుకు నారాలోకేష్ కు పక్కరాష్ట్రంలోని కేటీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని అవే శాఖలైన ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు..

మంత్రులు-వారి శాఖలు ఇవీ..
1. నారాలోకేష్ – ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
2. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి- వ్యవసాయ శాఖ
3. భూమా అఖిలప్రియ- టూరిజం శాఖ
4. ఆది నారాయణ రెడ్డి- మార్కెటింగ్
5. జవహర్-ఎక్సైజ్
6.సుజయ కృష్ణ రంగారావు- మైనింగ్ శాఖ
7. అచ్చెన్నాయుడు- రవాణా
8. పితాని సత్యానారాయణ- కార్మిక శాఖ
9. అయ్యన్నపాత్రుడు -రోడ్లు భవనాల శాఖ
10. రాఘవరావు -అటవీ
11.ప్రత్తిపాటి పుల్లారావు-పౌరసరఫరాలు
12. కేఈ కృష్ణమూర్తి- రెవెన్యూ
13. దేవినేని ఉమ-జలవనరుల శాఖ
14. మాణిక్యాల రావు-దేవాదాయ శాఖ
15. నారాయణ-మునిసిపల్
16-గంటా సత్యానారాయణ-విద్యాశాఖ

To Top

Send this to a friend