ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్ల పంచిన ఏపీ సీఎం..

అది టీడీపీ ప్రభుత్వం మరి.. ఏపీలో మెజార్టీ పత్రికలు, మీడియా బాబు కనుసన్నల్లో ఉన్నాయ్. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల అండ ఉంది. దిగ్గజ నాయకులు ఉన్నారు. వారందరినీ మేనేజ్ చేయాలంటే కొన్ని ప్రభుత్వ ఆస్తులు అప్పనంగా కట్టబెట్టాల్సిందే.. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది..

ప్రభుత్వం మనదైతే ఏం చేసినా నడుస్తుంది. ప్రతిపక్షం గట్టిగా లేకపోతే అయినవాళ్లకు ఎన్ని మేళ్లు చేసినా అది బయటకు రాదు. ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఏపీ కేబినెట్ నిన్న రాత్రి పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో ఆంధ్రజ్యోతి పత్రికాఫీసుకు వైజాగ్ లోని పరదేశిపాలెం బీచ్ దగ్గర 1.5 ఎకరాలు కేటాయించింది. అంతేకాదు టీడీపీ ఎమ్మెల్సీ బీద స్తాన్ రావుకి చెందిన బీఎంఆర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు 3.84 ఎకరాలు, రాజధాని గుంటూరు ఆత్మకూరులో తెలుగు దేశం పార్టీ ఆఫీస్ కోసం ఏకంగా 3.65 ఎకరాలను 99 ఏళ్లకు కేవలం ఎకరాకు వెయ్యి రూపాయల అద్దెపై కేటాయించడం వివాదాస్పదమైంది.

ఆంధ్రజ్యోతి, బీఎంఆర్ కు కూడా భూములు చాలా చీప్ గా కేటాయించారు. నిజానికి అక్కడ భూమి వ్యాల్యూ కోట్లలో ఉంది. ఇలా టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం తమ అనుయాయులకు అప్పనంగా కోట్ల విలువైన భూమిని కేటాయించడం.. టీడీపీ ఆఫీసుకు కేవలం వెయ్యికే ఎకరం అద్దెకు భూమిని కొట్టేయడం దుమారం రేపింది..

ఇంత భారీగా చంద్రబాబు సర్కారు భూమాయను చేస్తున్న ప్రతిపక్ష జగన్ కానీ, ఆయన మీడియా సాక్షి కానీ ఇప్పటివరకు ఒక్క వార్త కానీ, చానెల్ లో ప్రసారం కానీ చేయకపోవడం గమనార్హం. ప్రతిపక్షాలు ఇంత నిర్లక్ష్యంగా ఉండబట్టే చంద్రబాబు అంతలా రెచ్చిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. జగన్, సాక్షి మీడియా ఎప్పుడూ చంద్రబాబును కాపాడుతూనే ఉంటాయని.. అసలైన విషయాలు వదిలి.. అనవసర విషయాలను పైకి లేపి ఫెయిల్ అవుతారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

To Top

Send this to a friend