ఏపీ అవినీతి కథ.. సో ఇంట్రస్టింగ్


కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అధికార సంస్థ ఒకటి దేశవ్యాప్తంగా అవినీతి ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాను అప్పట్లో ప్రకటించింది. ఇందులో కర్ణాటక మొదటి స్థానంలో, ఏపీ రెండో స్థానంలో, తమిళనాడు మూడో స్థానంలో నిలిచాయి. ఈ గ్రేడింగ్ లతో తెలుగు రాష్ట్రం ఆంధ్ర పరువు పోయింది. అయితే అవేమీ పట్టించుకోకుండా మన పాలకులు ‘వారి పని’ వారు చేసుకుపోతూనే ఉన్నారు. అవినీతి మాత్రం తగ్గడం లేదనే అపవాదు మాత్రం ప్రజల్లో బలంగా ఉంది.. ఈ అవినీతికి ఎవ్వరూ అతీతులు కారనే సజీవ కథ ఒకటి ప్రచారంలో ఉంది.

ఏపీలోని ప్రముఖ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసిన ఓ పెద్దాయన రిటైర్ అయ్యి శేష జీవితం హాయిగా గడుపుతున్నారు. ప్రొఫెసర్ గా ఉన్న సమయంలో ఆయనకు మంత్రులు, ఉన్నతాధికారులు, గొప్పగొప్ప వాళ్లతో పరిచయాలు ఉండేవట.. చిటికెలలో ఏ పని అయినా జరిగిపోయేది. కానీ రిటైర్ అయిన చాలా ఏళ్లకు ఆయన కొడుకు విదేశాలకు వెళ్లేందుకు అవసరమయ్యే పత్రాల కోసం గవర్నమెంట్ ఆఫీసుకు వెళ్లాడు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన్ను అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. అందరి టేబుళ్లు తిరిగాడు. అందరు అధికారులు ఆ పత్రాలు ఎక్కడున్నాయో తెలియవని అటూ ఇటూ అధికారుల వద్దకు తిప్పారు.

84ఏళ్ల వయసులో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆపసోపాలు పడడం చూసి అటెండర్ ఆయన వద్దకు వచ్చాడట.. ‘అయ్యా మీరు చూస్తే పెద్దాయనలా ఉన్నారు. మీరు ఎంత తిరిగినా ఆ సర్టిఫికెట్లు మీకు ఇవ్వరూ 2000 ఇవ్వండి.. రేపొద్దున మీ ఇంట్లో ఆ పత్రాలు నేను తెచ్చిఇస్తాను’ అని సెలవిచ్చాడట.. ఆపసోపాలు పడిన పెద్దాయన ఇక తిరగలేనని గ్రహించి కిమ్మనకుండా రెండు వేలు ఇచ్చి సర్టిఫికెట్లు పొందాడట..

‘రిటైర్డ్ ఉద్యోగికే ఏపీ ప్రభుత్వ ఆఫీసులో జరిగిన అవమానం’ ఇటీవల చోటుచేసుకున్న ఒక యాథార్థ ఘటన . దీన్ని బట్టి ఏపీ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మాజీ ప్రభుత్వ ఉద్యోగుల నుంచే ముక్కు పిండి లంచాలు వసూలు చేస్తున్న ఏపీ ఉద్యోగులు ఇక ప్రజలను ఎలా వదిలిపెడతారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందుకే అవినీతిలో ఏపీ 2వ స్థానంలో నిలిచింది.

To Top

Send this to a friend