జగన్ ను బలిపశువును చేస్తున్న చంద్రబాబు, శిల్పా మోహన్


చంద్రబాబుకు ఇప్పుడు ఒక్కటే దారి.. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ సీటులో ఆ కుటుంబానికే టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి. దీంతో నంద్యాలలో టీడీపీనే నమ్ముకొని ఏళ్లుగా కొనసాగుతున్న శిల్పా మోహన్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వలేని పరిస్థితి. అందుకే చంద్రబాబు .. శిల్పా మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వనని చెప్పడం.. ఆయన వైసీపీలో చేరి జగన్ అండతో గెలవడానికి ప్రయత్నాలు చేస్తుండడం జరిగిపోతోంది.

అయితే ఇక్కడే ఒక్క ట్విస్ట్ .. నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి కుటుంబ బలపరిచిన అభ్యర్థి వర్సెస్ శిల్పా మోహన్ రెడ్డి తలపడడం ఖాయం. అయితే భూమా పై వ్యతిరేకత నంద్యాలలో ఎక్కువైపోయిందట.. వైసీపీకి కంచుకోటగా ఉన్న నంద్యాలలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లడంతో ఇప్పుడు భూమా ఫ్యామిలీ అభ్యర్థి ఇక్కడ గెలుస్తాడో లేదోనన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే అందివచ్చిన అవకాశంగా మలుచుకోవాలని శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అక్కడ బరిలోకి దిగబోతున్నారు..

అంతా బాగానే ఉన్నా శిల్పాకు ఉన్న అర్థబలం, అంగబలంతో వైసీపీ తరఫున గెలవడం లాంచనమేనన్న అంచనాలు నెలకొంటున్నాయి. కానీ శిల్పా గెలిచాక చంద్రబాబు ప్రభుత్వంలోకి ఆహ్వానించి పెద్ద పదవి ఇస్తే మళ్లీ శిల్పా చేరిపోయే అవకాశాలే ఎక్కువ. ఈ మేరకు లోపాయికారి ఒప్పందం జరిగిందని శిల్పా అనుచరులు ఈ మధ్య సన్నిహితులు వద్ద చెప్పినట్టు జగన్ చెవిలో పడిందట.. దీంతో వైసీపీ నుంచి శిల్పాను నిలబెట్టాలా వద్దా అన్న మీమాంసలో జగన్ ఉన్నట్టు తెలిసింది. చంద్రబాబు ఆడుతున్న నంద్యాల ఉప ఎన్నిక రాజకీయంలో శిల్పాను పావుగా వాడుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిలో జగన్ బలిపశువు కాకుండా ఉంటాడా లేదా అన్నది త్వరలోనే తేలనుంది.

To Top

Send this to a friend