ఏపీ కేబినెట్ లో పాత నీరు పోయి.. కొత్త నీరు..


కొత్త సంవత్సరం లో ఏపీ ఎమ్మెల్యేలకు తీపి కబురునందించేందుకు సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఏమీ మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఈసారి పాత వారికి, అవినీతి, ఆరోపణలు వచ్చిన వారికి ఉద్వాసన పలికేందుకు చంద్రబాబు డిసైడ్ అయ్యారు. కొత్తగా 5 నుంచి 8మందిని తీసుకునేందుకు అవకాశం ఉందని.. ఇందులో కొత్త ముఖలే ఎక్కువ ఉన్నాయని సమాచారం. ఇంకా రెండేళ్లుమాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో ప్రజాబలం.. సీనియారిటీ ఉన్నవారికి కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.

ప్రధానంగా ప్రస్తుతం అవినీతి ఆరోపణలు, చంద్రబాబు నిర్వహించిన సర్వేలో ఎవరైతే వీక్ గా ఉన్నారో వారి మీద వేటు పడడం ఖాయమంటున్నారు టీడీపీ సీనియర్లు.. ముఖ్యంగా ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న నిమ్మకాయల చిన్నరాజప్పకు మంత్రిపదవిని తీసేసి.. ఆయనకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్థానంలో జ్యోతుల నెహ్రూకు అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.

ముఖ్యంగా సీఎం కుమారుడు లోకేస్.. భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియలకు మంత్రివర్గంలో చోటు ఖాయంగా తోస్తోంది. వీరితో పాటుశ శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావ్, లేదా గౌతు శ్యాంసుందర్ శివాజీ, విజయనగరం నుంచి సుజయకృష్ణ రంగారావు, విశాఖ నుంచి వంగలపూడి అనిత, మరో నేత మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఇక గుంటూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, ప్రకాశం నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు నుంచి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు నుంచి అమర్నాత్ రెడ్డి, అనంతపురం నుంచి పయ్యావుల కేశవ్, లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు.

వీరంతా కూడా టీడీపీలో ప్రస్తుతం కీరోల్ పోషిస్తున్నారు. కానీ కుల, రాజకీయ సమీకరణాల వల్ల మొదటిదశలో మంత్రి పదవులు దక్కలేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వీరికి మంత్రి పదవులు ఇచ్చేందుకు రెడీ అయినట్టు సమాచారం.

To Top

Send this to a friend