ఏపీ అసెంబ్లీలో కిష్కింధకాండ

ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రచ్చరచ్చ జరిగింది. శాసనసభలోనే కాదు చివరకు మీడియా వద్ద కూడా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకోవడం.. తోపులాడుకోవడం మీడియా సాక్షిగా జరిగింది. ఈ వ్యవహారంతో ఏపీ ఎమ్మెల్యేల పరువు గంగలో కలిసింది. చిల్లర నీటి పంపు వద్ద లొల్లిలా వ్యవహారం సాగింది.

మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరీ చర్చించాలని పట్టుబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దాడులను ప్రస్తావించారు ఈశ్వరీ. ఈ క్రమంలోనే అసెంబ్లీ వాయిదా పడింది. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యే అనిత వైసీపీ తీరుపై మండిపడ్డారు. అదే సమయంలో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు రావడంతో వారి మధ్య తోపులాటలు, గొడవులు, తిట్టుకోవడాలతో మీడియా ప్రాంగణం రచ్చరచ్చ అయ్యింది. దీనంతటిని లైవ్ టెలికాస్ట్ ఇచ్చి చానళ్లు ఓ గంట సేపు పండుగ చేసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి.

To Top

Send this to a friend