బీహార్ మరో తమిళనాడు.. చిచ్చు పెట్టిన మోడీ..

అంతా మోడీ అనుకున్నట్టే జరుగుతోంది. ధీర వనిత, మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత తమిళనాడును ఫుట్ బాల్ ఆడుకున్న బీజేపీ ద్వయం మోడీ-అమిత్ షాలు ఇప్పుడు బీహార్ ను అల్లకల్లోలం చేసేందుకు కంకణం కట్టుకున్నారు.

ప్రస్తుతం బీహార్ లో నితీష్ ముఖ్యమంత్రిగా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా ఏర్పడి విజయం సాధించి పాలన సాగిస్తున్నాయి. ఇందులో ఆర్జేడీ లాలూ ప్రసాద్ ఎక్కువ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించారు. మోడీ నేతృత్వంలోని బీజేపీని తుక్కుతుక్కుగా ఓడించారు. ఆ కోపం మనసులో పెట్టుకున్న మోడీ-షాలు ఇప్పుడు బీహార్ లో మెజార్టీ సీట్లు సాధించిన లాలూ ప్రసాద్ యాదవ్ మీద ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డారు.

లాలూ మీద సీబీఐ తో దాడి చేయించి ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలను వెలికితీస్తున్నారు. ఆయన్ను జైలుకు పంపేందుకు రెడీ అయ్యారు. లాలూ పై సీబీఐ రైడ్ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోతోంది. పాలక మహాకూటమి నుంచి లాలూ ఆర్జేడీ వైదొగలడం ఖాయం గా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం పడిపోకుండా మోడీ చక్రం తిప్పుతున్నారు.

మహాకూటమినుంచి లాలూ వైదొలిగితే బయటనుంచి మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని.. ప్రభుత్వం కూలిపోకుండా చూస్తామని బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు. అయితే నితీష్ కాంగ్రెస్, లాలూ తో తెగతెంపులు చేసుకోవాలని షరతు పెట్టారు. ఇలా మరో తమిళనాడులా బీహార్ లోనూ పాగా వేసేందుకు మోడీ-షాలు దాదాపు చేరువయ్యేరనే చెప్పవచ్చు..

To Top

Send this to a friend