ఉయ్యాలవాడలో మరో స్టార్ హీరో

ఉయ్యాలవాడ సినిమాకు స్టార్ తారాగణమే ఎంపికవుతోంది.. ఇప్పటికే బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్, తమిళ కుట్టి నయనతారలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఇప్పుడు మరో స్టార్ హీరోను ఈ సినిమాలో నటించేందుకు చర్చలు జరిపారట.. ఆ హీరో స్వయంగా మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. చిరంజీవి ఉయ్యాలవాడను మరో బాహుబలి తరహాలో జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఉయ్యాలవాడ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాలంటే అందులో పేరున్న నటులు ఉండాలని భావించి అన్ని భాషల్లోని అగ్రనటులను ఈ సినిమాకు ఎంపిక చేస్తున్నారు. రాజమౌళి తీసిన ఈగ సినిమాలో విలన్ గా అలరించిన కన్నడ అగ్ర నటుడు సుదీప్ గుర్తుందిగా.. ఆ తర్వాత బాహుబలి సినిమాలో కూడా అరబ్ దుబాయ్ షేక్ గా నటించాడు. ఎంతో బాగా యాక్టింగ్ చేసే సుదీప్ ను ఉయ్యాలవాడలో ఓ కీలక పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం.

కన్నడ, తెలుగు తెలిసిన పోరాట యోధుడి పాత్రలో సుదీప్ నటించాలని దర్శకుడు సురేందర్ రెడ్డి ఆయనకు కథను వినిపించారట.. దీనిపై సుదీప్ కూడా ధ్రువీకరించాడు.. ‘చర్చలు నడుస్తున్నాయి. తెలుగు, కన్నడ భాషలు రెండూ మాట్లాడే ఒక శక్తిమంతమైన పాత్రను నాకు ఆఫర్ చేశారు.. ప్రత్యేకించి ఈ పాత్ర కోసం వాళ్లకు నేనే గుర్తుకొచ్చానని.. దీన్ని గౌరవంగా భావిస్తున్నానని. . చిరంజీవి గారి పక్కన నటించే అవకాశం రావడం అధృష్టం’ అని సుదీప్ మీడియాకు వివరించారు. ఉయ్యాలవాడను జాతయ స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నందున ఈ సినిమాలో పేరుపొందిన తారల్ని తీసుకుంటేనే ప్రయోజనం కలుగుతుందని చిరంజీవి సురేందర్ రెడ్డిలు భావిస్తూ అగ్రనటులను తీసుకుంటున్నారు.

మొత్తంగా ఈ ప్రయత్నం ఫలిస్తే మరో బాహుబలి లాంటి వెండితెర అద్భుతాన్ని తెరపై చూడొచ్చు. తెలుగు వారి స్టామినాను మరోసారి దేశానికి చాటిచెప్పవచ్చు..

To Top

Send this to a friend