‘డీజే’ కొత్త వివాదం.. దిల్‌రాజు హ్యాపీ

 

 

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘డీజే’ చిత్రంకు మిశ్రమ స్పందన వస్తుంది. ఫ్యాన్స్‌ను మెప్పించిన ‘డీజే’ రొటీన్‌ కథ, సెకండ్‌ హాఫ్‌ సాగతీత దోరణిలో ఉండటంతో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక మొత్తంగా యావరేజ్‌గా నిలిచింది. ఈ సమయంలోనే చిత్రంపై వివాదాలు పెరుగుతున్నాయి. చిత్రంలో బ్రహ్మణ యువకుడు అయిన హీరో చెప్పులు వేసుకుని గాయత్రి మంత్రంను చెప్పడాన్ని బ్రహ్మణ సంఘం నాయకులు తప్పుబడుతున్నారు.

సినిమాపై చర్యలు తీసుకోవాలని, సినిమాను బ్యాన్‌ చేయాలంటూ బ్రహ్మణ సంఘాలు ఆందోళ మొదలు పెడుతున్నాయి. ఇప్పటికే సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టిన దిల్‌రాజు ఇంకా ప్రమోషన్‌కు అంటూ పెట్టడం వృదా అనుకుంటున్నాడు. ఈ సమయంలో బ్రహ్మణ సంఘాలు వివాదం సృష్టించడంతో ఫుల్‌గా పబ్లిసిటీ దక్కుతుంది. దాంతో పబ్లిసిటీకి పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. అందుకే దిల్‌రాజు హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

వారం నుండి రెండు వారాల వరకు బ్రహ్మణ సంఘాల వారు ఆందోళన చేయడం, మీడియాలో డీజే గురించి మాట్లాడటం జరుగుతుంది. వారు ఎంతగా ఆందోళనలు చేసినా కూడా సెన్సార్‌ వచ్చిన సినిమాను ఏమీ చేయలేరు. అందుకే దిల్‌రాజు హాయిగా తడి గుడ్డ వేసుకుని కలెక్షన్స్‌ను లెక్క వేసుకోవాలని భావిస్తున్నాడట. మొత్తానికి దిల్‌ రాజు తెలివైనోడు అని మరోసారి ఈ సంఘటనతో రుజువైంది.

To Top

Send this to a friend