అన్ని మతాల వారిని చూరగొన్న సీఎం


ఒక్క నిర్ణయం.. ఒకే ఒక్కనిర్ణయంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్ని మతాల వారి అభిమానాన్ని చూరగొన్నారు. యూపీలో పవిత్ర స్థలాలుగా జనం భావించే అన్ని ప్రాంతాల్లో మధ్యనిషేధం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. పక్కా హిందుత్వవాదిగా పేరుగాంచిన యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయంతో ముస్లిం, క్రైస్తవ మతస్థుల అభిమానాన్ని కూడా చూరగొన్నారు..

రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ విధానాన్ని అమలు చేయాలని.. ఇందులో భాగంగా జాతీయ రహదారుల పక్కనతో పాటు పవిత్ర స్థలాలైన గుడులు, గోపురాలు, మసీదులు, చర్చిల వద్ద మద్యం దుకాణాలను మద్యంను నిషేధించారు. ఈ నిర్ణయంపై అన్ని మతాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యోగి ఆదిత్యనాథ్ గద్దెనెక్కిన నెలరోజుల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రజల సీఎంగా పేరు తెచ్చుకుంటున్నారు. యూపీ సీఎం అయిన మొదలు అక్రమ కబేళాలకు కల్లెం వేశారు. అనంతరం అమ్మాయిలను ఏడిపిస్తున్న ‘యాంటి రోమియో’ స్క్వాడ్ లను ఏర్పాటు చేసి మహిళలకు పెద్దన్నగా మారారు. తాజాగా పవిత్ర స్థలాల్లో మద్యం నిషేధం అమలు చేయడంపై మతపెద్దలందరూ యోగిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

To Top

Send this to a friend