ఆకట్టుకుంటున్న ఏంజెల్ ట్రైలర్

 

సోషియో ఫాంటసీ మూవీ ఏంజెల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం విశేషం. దాదాపు 40 నిమషాల గ్రాఫిక్స్ తో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు నూతన నిర్మాత భువన్ సాగర్. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మరియు నిర్మాణ పర్యవేక్షకులుగా బాధ్యతలు వహించారు. ఇప్పటికే విడుదలైన ఏంజెల్ టీజర్ కు, భీమ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ కు అనుహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఏంజెల్ ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని నిర్మాత భువన్ సాగర్ తెలిపారు. అతి త్వరలో ఏంజెల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్ర వర్గం

చెబుతుంది.
బ్యానర్ : శ్రీ సరస్వతి ఫిల్మ్స్, తారాగణం : హీరో- నాగ అన్వేష్, హీరోయిన్- హేబా పటేల్, సుమన్, సప్తగిరి, కబీర్ ఖాన్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, ప్రియదర్శీ, ప్రభాస్ శ్రీను, సన, సాంకేతిక వర్గం : ప్రొడ్యూసర్- భువన్ సాగర్, డైరెక్టర్- ‘బాహుబలి’ పళని, సంగీత దర్శకుడు- భీమ్స్ సెసిరోలియో, సినిమాటోగ్రఫి – గుణ

To Top

Send this to a friend